[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రాణించాలంటే వకీళ్ళకు ఇది కావాలి (5) |
4. మామూలు సినిమా కాదు. డిఫరెంట్ మూవీ. (5) |
7. కృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఒక సినిమా. (3) |
8. అట్నుంచి రబ్బిష్. కలము ఉంది సుమా! (5) |
9. తల్లిదండ్రులు, గురువులతో పాటు వీరినీ దైవసమానులుగా చూడాలని సూచించే వాక్యం (3,2,2) |
11. కోటీశ్వరునికంటే తక్కువ స్థాయి వాడు. (5) |
13. కొరడా (2) |
15. కొండల్రావు, రంగారావు, నారాయణరెడ్డి గార్ల ఇంటిపేరు ముందు చేరిస్తేనే వారిని గుర్తించగలము (2) |
17. తుషారకిరణ, హిమధామ, నగపతి, కళాభృత్, రజనీకాంత (5) |
20. “సుప్రజ” కృతికర్తలలో పెళ్ళకూరు జయప్రద, వి.ప్రతిమలతో పాటు వీరూ ఉన్నారు. (4,3) |
22. జిడ్డున్న పాలేఱు (5) |
23. ఒళ్ళు రుద్దుకోడానికి నూరిన సుగంధాల పిండి (3) |
24. మాయింటిలో సంధిలేని చోట సంభవించినది. (5) |
25. బామ్మర్ది కొడుకు భలే కలిసిపోయాడు (5) |
నిలువు:
1. గోవుల తోకతో స్థానం చెదిరింది. (5) |
2. అంతిమ లక్ష్యం (5) |
3. ఆడు మేకపిల్ల (3) + శత్రువు (2) = సంకోచం గజిబిజిగా (5) |
4. పెద్దబోడతరపు చెట్టు (5) |
5. చైనానాయకుని పేరును తన పేరులో ఇముడ్చుకున్న బండారు నాయకే (4) |
6. సావిత్రి డైరెక్షన్లో వచ్చిన తెలుగు సినిమా (5) |
10. దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే వ్యక్తి (4) |
12. ఈ సత్యనారాయణ ఇంటిపేరుతో గుర్తింపు పొందిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు. (4) |
14. బెంగాలీ ప్రజల ఒక ఇంటిపేరు. ఈ పేరున్న బిభూతిభూషణ్ ఓ నవలాకారుడు. (5) |
16. ఆడదే ఆధారం సినీ దర్శకుని పరువుతో కలిగే ఆశ్చర్యం (5) |
17. ముళ్ళచెట్టు నుండి లభ్యమయ్యే బంక (5) |
18. విశ్వసనీయుడు (5) |
19. పతంజలి వ్రాసిన నవలిక గజిబిజిగా మారింది. (5) |
21. ఐదున్నొక్కటి (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 59 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 30 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 57 జవాబులు:
అడ్డం:
1.పునాస 3. చరాయిత 6. ఎమ్మి 7. రహి 8. నవల 10. పుసి 11. జలగ 12. ధూమిక 14. సోన 16. జాటి 17. పరాచికము 20. హలం 22. తివారి 23. దబ్బలం 24. మోదకం 26. షరా 27. తప్పటడుగు 30. పేటి 32. వాణి 33. భూజంతు 35. దృంభువు 36. కైపు 37. బూరగ 39. నవ 41. హ్రీకం 42. సినీవాలి 43. డిగ్గియ
నిలువు:
1.పుబ్బ 2. సరసి 4. రామలక్ష్మి 5. తన 6. ఎలమి 9. వధూటి 10. పునరావాసం 12. కథ 14. సోపతి 15. బంక 16. జాలం 18. చిరి 19. ముదరా 20. హలంత 21. మెదడు వాపు 24. మోట 25. కంగుణి 26. షటి 28. ప్పన్న 29. విభూ/ప్రభూ 30. పేతుర 31. ప్రభుదేవా 34. జంబూకం 36. కైవడి38. గసి 40. స్థాయ
నూతన పదసంచిక 57 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- లలితా మల్లాది
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.