‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. గులాబి, ఊదా, ఎరుపు రంగుల మిశ్రమం (3) | 
| 3. హిందూ దేశస్థుడు (3) | 
| 5. మధ్యతరగతి శ్రామికేతర వర్గం (3) | 
| 7. అల్లరి, సంతోషం (3) | 
| 8. వెనుదిరిగిన సముద్రతీరం (3) | 
| 9. MDMK పార్టీ వ్యవస్థాపకుడిని తిరగేస్తే సరళ ఇంటి పేరు వస్తుంది (2) | 
| 11. దిటవు లేని ఘనం (2) | 
| 12. వెలి (5) | 
| 13. కాంగ్రెస్ గడ్డి (5) | 
| 15. పండితులు బిరుదుగా కాలికి ధరించే అందె (5) | 
| 18. ఈ బిందుపథము ఒక బిందువు ఒకదిక్కులో కదిలినప్పుడు ఏర్పడుతుంది (5) | 
| 20. ఫ్రాకు (2) | 
| 21. బాబు లేని యర్రా శేషగిరిరావు (2) | 
| 23. ఇటీవల ఉమ్మడిశెట్టి అవార్డును దక్కించుకున్న కవి (3) | 
| 24. పడమటి కనుమల్లో ఓపికగా వెదికితే కనిపించే నేర్పు (3) | 
| 26. అసలు కానేకాదు (3) | 
| 27. ఇంగ్లీషు దవడతో మొదలై హిందీ పిల్లితో ముగిసే చందమామ (3) | 
| 28. చదరంగంలో ఒక పావు, బిషప్ (3) | 
నిలువు:
| 1. కోడిమెడతో వైద్యవిద్యార్థి (3) | 
| 2. గుఱ్ఱమే నంటార? (2) | 
| 3. అర్థం (లేని) కాని శ్రీశ్రీ ధ్వంస రచన (5) | 
| 4. క్రింది నుండి పైకి లేచిన ఆమని (5) | 
| 5. బూదరాజు రాధాకృష్ణ గారి కాహళి (2) | 
| 6. స్త్రీల ఎక్స్ఛేంజి ఆఫర్ (3) | 
| 10. ఎందుకు వారు అతడు వెరసి సీత (3) | 
| 11. అడ్డం 7 వంటిదే (3) | 
| 12. జ్ఞాతి బంధు సమూహం ఇటీవలి సినిమా (3) | 
| 14. టీవీల మధ్యలోనిది మఖ మధ్యలో చేర్చితే కాంతి (3) | 
| 16. తెరచాప (3) | 
| 17. సి.యస్.రావు డైరెక్షన్లో లక్ష్మీరాజ్యం నిర్మించిన నాగేశ్వరరావు సినిమా (5) | 
| 18. వావిలాల గోపాలకృష్ణయ్య జన్మస్థలం (5) | 
| 19. రాయసం వెంకట శివుడు జన్మస్థలం (3) | 
| 20. సరస సాహిత్య లక్షణ విచక్షణుడు అనే బిరుదు ఉన్న కవి (3) | 
| 22. ముదరా (3) | 
| 23. కాపాడేవాడని పరమార్థము (2) | 
| 25. శార్దూల విక్రీడితంలో తొలి రెండు గణాల బ్యూటీ (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 62 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 21 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 60 జవాబులు:
అడ్డం:
1) గంగ యమున సరస్వతి 6) సుధామధురం 7) సత్ప్రవర్తన 9) క్షమాభిక్ష 10) స్వరగముతరం (స్వర తరంగము) 12) సాగనిఆటలు 14) ఆముష్మిక 17) ముదనష్టము 18) ఫాలనేత్రుడు 19) ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
నిలువు:
2) గరిమనాభి 3) ముమ్మరంగా 4) సరసభారతి 5) స్వయంవరము 6) సులక్షణసారము 8) నగరంధ్రకరుడు 11) పంటచములువ (పంచ వటములు) 13) నిచ్చెనమెట్లు 15) ముత్రనేనోమ 16) సిఫారసు 
నూతన పదసంచిక 60 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

