నూతన పదసంచిక-64

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అరుణిమలో ఒక ఐశ్వర్యము (3)
3. వనమాలీ పెళ్ళి విందు ఎక్కడ? అంటే తనలో వెదకమంటాడు. (3)
5. అప్సరస వెనుక నుండి గాంచమే (3)
7. గురజాడ వారి చిన్న కథ (2,3)
9. వత్సరాజు ఉదయుని భార్య.  భాసుని సృష్టి (5)
11. సంచికలో సీరియల్ (5)
12. కామణ్ణ పండగ (2,3)
14. స్వప్నము + కోరిక = అలజడి (5)
15. అడ్డం 11 ఈయప్పదే (5)
16. అంశభుక్కులు (5)
19. లోకులు భలే దుర్మార్గులబ్బా (5)
22. వితండవాదము వివాద రహితము. (3)
23.  కిన్నెర మల్లికార్జున రావుగారి కురాళము (3)
24. సంతోషించే మహిళ కోసం వార్థక్యానికి ఓ స్త్రీ ప్రత్యయాన్ని జోడించండి (3)

నిలువు:

1. చిట్టెలుక, చూరెలుక (3)
2. అడ్డం 1కి తరువాయి (3)
3.  పహిల్వాను (3)
4. శ్రీదేవి అదేదో సినిమాలో చిరంజీవిని ఇలా పిలవడం మానదు. (3)
5. కనుదోయి. (3)
6. జయసుధకు విజయనిర్మల చుట్టరికం (3)
8. రావణాసురుడు చేసింది (7)
10. సంగీతంలో ప్రాథమిక పాఠాలు (7)
11. కంపేరిజను (3)
13.  మీ రాజ్యం మీరేలండి పుస్తకం వీరిదే (3)
16. స్వకీయమైన దాని ముందు సూర్యుని వెలుగు చేర్చితే ప్రకాశవంతమౌతుంది (3)
17.  తిమ్మిరి (3)
18. లులాయం (3)
19. పారిపోయినవాడు (3)
20. గొంతు (3)
21. లలితకు కొమ్మిస్తే కదులుతుంది (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 64 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 04 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 62 జవాబులు:

అడ్డం:   

1) మెజెంటా 3) హిందువు 5) బూర్జువా 7) రభస 8) ర్తుగారా 9) కోవై 11) గనం 12) బహిష్కరణ 13) వయారిభామ 15) గండపెండేరం 18) సరళరేఖ 20) గౌను 21) గిరి 23) వసీరా 24) పటిమ 26) నకిలీ 27) జాబిల్లి 28) సగటు

నిలువు:

1) మెడికో 2) టార 3) హింసనచణ 4) వుర్తుతసంవ 5) బూరా 6) వాయనం 10) వైదేహి 11) గలభా 12) బలగం 14) మయూఖ 16) డమాను 17) రంగేళిరాజా 18) సత్తెనపల్లి 19) రేలంగి 20) గౌరన 22) రిబేటు 23) వలీ 25) మస ‌‌

‌‌నూతన పదసంచిక 62 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • లలితా మల్లాది
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here