నూతన పదసంచిక-68

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ప్రావీణ్యం గలవాడు. నేర్పరి. (2,3,2)
5. వీధిభాగవతమే మరొక రూపంలో (5)
6. మందగమన (5)
9. సరస్వతి (4,3)
12. గజిబిజిగా ఆటతోట (5)
13. రూపాయి రూపాయి నమో నమో శ్రీ రూపాయి అనే పాటను ఆరుద్ర ఈ సినిమా కోసం వ్రాశాడు. (2,3)
14. అక్షరం మారినా అంగరంగవైభవమే. సమస్త భోగాలే. (7)
17. విన్నర్ (5)
19. పూలతో దేవుడికి చేసే అలంకరణ. ప్రతి శుక్రవారం తిరుమల వెంకటేశ్వరునికి ఈ వైభోగం ఉంటుంది. (5)
20. సి.ఆర్.రెడ్డి అంటే గుర్తుకు రావలసిన కావ్యం. (4,3)

నిలువు:

2. చిలుము అనుకొనేరు. కాదు. భంగు సేవించడానికి ఉపయోగించే పొడుగాటి గొట్టం (3)
3. యజ్ఞయాగాలు చేసే కోరిక ఉన్నవాడు (4)
4.  దక్షిణ అమెరికాలో కనిపించే అతి పెద్ద సర్పం (4)
6.  నిరుడు (2,4)
7. ఈ రైల్వే గేటు వంశీ నవలకు శీర్షికై కూర్చొంది. (6)
8. నిశ్చయముగా ఇది గుంపే. (4)
10. వర్క్ ఎక్స్పీరియన్స్. (2,4)
11. ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యములో ఒక పాత్ర, ఆ పాత్ర మరోపేరు (3,3)
13. ఒకానొక గిరిజన జాతి. (4)
15.  భారీ పూదండ (4)
16.  ప్రశ్నతో మొదలయ్యే గొప్పదనం, ఠీవి. (4)
18.  దీర్ఘం లేకపోయినా అవశిష్టమే. (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 27 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 68 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 02 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 66 జవాబులు:

అడ్డం:   

1) ఒకటి 3) నాలుగు 5) తొమ్మిది 7) కారాలు 8) బుగులు 9) కరోనా 11) కనరు 13) తమస 15) ఇలిక 17) ఎనభై 19) సత్తువ 21) రాహువు 22) రభువు 23) వైహళి 25) సంజీవి 27) రురువు 29) నవుజు 31) ఆత్మజ 33) పరంగి 35) ష్టశివి 36) వసంతం 37) భైక్షము 38) లియ్యము 39) గిలక

నిలువు:

1) ఒద్దిక 2) టికానా 3) నాలుక 4) గుబురు 5) తొలుత 6) దిమ్మిస 10) రోకలి 12) నర్తన 14) మహత్తు 15) ఇరవై. 16) కరాళి 17) ఎవుసం 18) భైరవి 19) సవురు 20) వస్తువు 24) హతువు 26) జీవాత్మ 28)రుధిరం 29) నలభై 30) జుష్టము 31) ఆవిలి 32) జవము 33) పతంగి 34) గిరిక ‌‌

‌‌నూతన పదసంచిక 66 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here