నూతన పదసంచిక-9

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దొరగారి కుమారుడు + ఇల్లు. నాటకం లో రక్తి కట్టించేది (4)
4. వేసవి లో తాకేది. (4)
7. ఈ రోజు కార్మికులు సాధించినవి‌ (5)
8. నేడే (2)
10. బయటివాడు మధ్యలో పోయాడు (2)
11. రాత్రి లేని రాత్రింబవళ్ళు (3)
13. అటునుంచి వస్తున్న ఈ కల్యాణి ఎప్పుడూ వివాదస్పదురాలే (3)
14. అక్షరాలతో పాటు నేర్చుకోవలసినవి (3)
15. అన్నలు పట్టేవి (3)
16. ఈరోజు పుట్టుకకు పునాది ఈ నగరం (3)
18. తమిళులు లో సగం మంది లేరు (2)
21. మంచిజాతి లోంచి మేక పోయి ఇది మిగిలింది (2)
22. శ్రీ శ్రీ మాటల్లో నరజాతి సమస్తం దీని పరాయణత్వం (5)
24. వదంతులు చెల్లాచెదురయ్యాయి (4)
25. దుఃఖము (4)

నిలువు:

1. భారత జాతీయ నినాదం లో కొంత భాగం (4)
2.  ఈ కాయంత ఉంటుందట వెర్రి కొంతమంది కి (2)
3. వారసులు లేని వంశం ఒక రీతిలో లేదు (3)
4. వాజమ్మ తిన్నగా లేడు (3)
5. వీటిని వంచి సాధిస్తామనుకుంటే మొదట్లోనే  విరిగి పోయింది.(2)
6. నమస్కారం అలా కింద నుంచి పెట్టడమా! తప్పుకదా! (4)
9. నిఘా సంస్థలలో వాళ్ళవి ఇలాంటి వే (5)
10. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి బాలసాహిత్యం లో ఇవున్నాయి. (5)
12. పోరాడితే పోయేవి (3)
15. రాష్ట్ర ప్రధమ పౌరుడు.  ఉకారంతము చెయ్యక తప్పదు (4)
17.  ఇదో రకం చారు అనుకునేరు కాదు పాలు (4)
19.  వెనుదిరుగు (3)
20. అన్నలుండే కోన (3)
22. తేలికైన సూపము.ఎవర్నీ ఉద్దేశించి అనడంలేదు (2)
23. హిందీ మత్తు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 10 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 9 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 15 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 7 జవాబులు:

అడ్డం:   

1.బాహాబాహి 4. హాహాహూహూ 7. కతైడుతలా 8. భేక 10. భవ 11.దిడఅ 13. వ్రజము 14. ఎక్కాలు 15.వీరాధి 16. స్రవించు 18. రయ 21. దండు 22. జుర్రావీముసో 24. హుటాహుటి 25. కయిదండ

నిలువు:

1.బాహుభేది 2. బాక 3. హితైషి 4.హాతర 5. హాలా 6. హూరవము 9. కడపరాయ 10. భజగోవిందం 12. చుక్కాని 15. వీరబాహు 17. చుడుపడ 19. ఎర్రాటి 20. ఎముక 22. జుహు 23. సోయి‌

నూతన పదసంచిక 7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకటరెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here