[dropcap]ద[/dropcap]సరా సందర్భంగా సంచిక నిర్వహించిన కవితల పోటీని విజయవంతం చేసిన కవులకు, కవయిత్రులకు ధన్యవాదాలు. ఉత్తమ కవితలను నిర్ణయించిన న్యాయనిర్ణేతలకు, పాఠకులకు కృతజ్ఞతలు.
బ్యాంకు ఎకౌంట్ వివరాలు పంపిన కవులకు/కవయిత్రులకు వారి బహుమతి మొత్తాన్నిపంపడం జరిగింది.
సంచిక దీపావళి సందర్భంగా నిర్వహించిన కథల పోటీకి 62 కథలు అందాయి. వాటిని న్యాయనిర్ణేతలు పరిశీలిస్తున్నారు. ఆయా కథలను చదివి తమకి ఉత్తమమైనవిగా అనిపించిన మూడు కథలను పాఠకులు ఎంపిక చేయవచ్చు. న్యాయ నిర్ణేతలు ఎంపికచేసిన కథలకీ, పాఠకులు ఎంపిక చేసిన కథలకీ బహుమతులుంటాయి. పోటీకి వచ్చిన ప్రతి కథను పాఠకులకు రచయిత పేరు లేకుండా నెంబరుతో అందించడం జరిగింది. పాఠకులు తమకు నచ్చిన కథ నెంబరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్ చేసే పాఠకులు విధిగా సంచికను సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. సబ్‌స్క్రైబ్ చేయని పాఠకులు ఓటింగ్‍కి అనర్హులు.
ఓటింగ్ నవంబరు 6 వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. వివరాలకు ఈ లింక్ చూడగలరు.
https://sanchika.com/2018-dipavali-kadhala-poti/
కథల పోటీకి 62 కథలు చదివి, వాటిలో తాము ఉత్తమమని భావించినవాటికి ఓటు వేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ 1 నవంబరు 2018 నాడు వచ్చే సంచికలోనూ, 4 నవంబరు 2018 నాడు కథలు ఉండవు. ఇతర రచనలు కూడా తక్కువగా వస్తాయి. రచయితలు, పాఠకులు గమనించవలసిందిగా మనవి.
1 నవంబరు 2018 నాటి సంచికలో ఈక్రింది రచనలు ఉన్నాయి:
ధారావాహికలు:
అంతరం-3 – స్వాతీ శ్రీపాద
తమసోమా జ్యోతిర్గమయ- 4 – గంటి భానుమతి
నీలమత పురాణం – 5 – కస్తూరి మురళీకృష్ణ
ప్రత్యేక వ్యాసం:
కాలదర్శిని: భారతీయ తాత్విక చింతన – మన కర్తవ్యం – మోటమర్రి సారధి
వ్యాసాలు:
జాషువా సాహిత్యంలో శిశువు, కులం – మతం సామాజిక దృష్టి – దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ప్రేమ – శారదా తనయ
కాలమ్స్:
రంగుల హేల -8 : కట్ చేసి అతికితే సరి! – అల్లూరి గౌరీ లక్ష్మి
కవితలు:
అయిదు కందములు – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
గళ్ళ నుడికట్టు – శ్రీధర్ చౌడారపు
ఉపశమనం – సి.హెచ్. గురుమూర్తి
స్పష్టంగా ఆలోచిద్దాం – పి. తులసీదాసు
కార్టూన్:
కె.వి.సుబ్రహ్మణ్యం
4 నవంబరు 2018 ఆదివారం నాటి సంచికలో సీరియల్స్, కవితలు, రెగ్యులర్ కాలమ్స్, భక్తి పర్యటన వ్యాసం, భక్తి రచన, పుస్తక సమీక్షలు, సినీ విశ్లేషణ, సినీ సమీక్ష, బాలసంచికలో నాలుగు రచనలు ఉంటాయి.
7 నవంబరు 2018 నాటి దీపావళి సందర్భంగా కథల పోటీ ఫలితాలు, దీపావళి పండుగ విశిష్టతని తెలిపే బాలల రచన ఒకటి ప్రచురితమవుతుంది.
కవితల పోటీలు, కథల పోటీల రచనల ప్రచురణ కారణంగా కొత్తగా ప్రారంభించదలచిన సీరియల్స్ కొద్దిగా ఆలస్యమవుతున్నాయి.
త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.