Site icon Sanchika

నుమాయిష్

[శ్రీ జూకంటి జగన్నాథం రచించిన ‘నుమాయిష్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]చి[/dropcap]న్నప్పటినుండి ఉంది ఖాయిష్
చూడాలని పట్నంలో నుమాయిష్

జేబులో ఏటీఎం డబ్బులు
కురువని తెలి మబ్బులు
ప్రవేశానికి ఒక రేటు
ప్రదేశానికి ఒక వెల

కళ్ళు చెదిరిపోయే
రంగురంగుల విద్యుత్ దీపాలు

దేశ దేశాలు షూ కోటు టై వేసుకొని
రంగు రంగుల చమక్ మనే
సౌకర్యాల కరపత్రాలు పంచి పెడతరు

హైదరాబాద్లో దావోస్లో
రెండూ రెండే అంగళ్ళే

ఇక్కడ వస్తువులను నమ్ముకోవడం
అక్కడ ప్రపంచ వాణిజ్య మార్కెట్లో
మనల్ని మనం ప్రమోట్ చేసుకొని
అమ్మకానికి పెట్టుకోవడం

చిన్నప్పటి నుండి వుండె ఒక ఖాయిష్
హైదరాబాదులో చూడాలనే నుమాయిష్

Exit mobile version