[dropcap]న[/dropcap]రకయాతనలోనూ సృష్టి చేసే అమ్మవో
తుమ్మకంపల్లో కూడా అందమైన గూడు కట్టే గిజిగాడివో అయ్యుంటావు
గతుకుల దారిలో
పడుతూ లేచే
బండి చక్రానివీ అయ్యుంటావు
రాలిన వర్షపు చినుకు చప్పుడువో
రగులుతున్న ఆకలి మంటవో
ఆనంద పారవశ్యాన విరిసిన మల్లెవో
ఆగ్రహ జ్వాలవో కూడా అయ్యుంటావు
అయితే ఇంకొక విషయమైతే మరీ నిజం
వేదనా మోదమూ
ప్రతి అనుభవమూ
నీదిగా పొదువుకునే
కవివి మాత్రం తప్పక అయ్యుంటావు