[dropcap]ను[/dropcap]వ్వు చాలు, నీ నవ్వు చాలు
విచ్చిన ఆ హృదయంలో
కాస్త చోటు చాలు ॥నువ్వు॥
పాట పల్లవించే తరుణంలో
మాట మౌనమైన వేళల్లో
నువ్వు వస్తే చాలు
పువ్వు ఇస్తే మేలు ॥నువ్వు॥
బాధ మదిలో గూడు కట్టినపుడు
హాయి నాలో ఎగిరి పోయినపుడు
తలిరుబోడివై తరలిరావె
తెలి తెమ్మరవై తడిమి పోవె ॥నువ్వు॥