నువ్వు నేను

1
1

[dropcap]అ[/dropcap]ప్పుడప్పుడు!
నువ్వో అగ్నిపర్వతమై బద్దలైనప్పడు…
కోపపు లావాను మన బంధపు వేదికపై పారించినప్పుడు…
నేనో సహనపు మంచుతీవెనై నీ హృయయసీమను అల్లుకోపోతుంటా…!

నువ్వు
ఆవేదనల శిశిరంలో
ఆనందాల ఆకులను నేలరాల్చినప్పుడు..
ఒంటరి మోడై అసహాయతల కంటకాలను కన్నప్పుడు…
నేనో ఆత్మీయహస్తపు పచ్చని ఆకునై చిగురించుతుంటా…!

నువ్వు
బరువైన బాధ్యతల కావడిని అనుభవభుజాలపై మోస్తున్నప్పుడు…
కుటుంబపు ఆశలపల్లకికి బోయివై పయనిస్తున్నప్పుడు…
నేనో అనురాగసోననై మమతలను జల్లుతుంటా…!

అపార్థపు యవనిక
నీ మనసుఅంచులపై పరుచుకున్నప్పుడు…
నిష్ఠూరపు పలుకులు
నీ అధరాల పాళీనుండి జాలువారినప్పుడు…
నేనో అవగాహనా పువ్వునై విచ్చుకుంటుంటుంటా…!
సఖ్యతా మకరందాలను ఊరిస్తుంటా..!

నువ్వూ నేను సరిగమలమై సంగమిస్తేనే
సంతసాల బాణిలో సంసార సరాగాలను ఆలపించగలం!!
జీవన విపంచిన నవ గీతికలను పల్లవించగలం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here