Site icon Sanchika

నువ్వు-నేను

[box type=’note’ fontsize=’16’] ఇద్దరూ ఒకటే అయినప్పుడు తనకోసం అన్వేషించవలసింది బయటకాదు తనలోనే అని తెలుసుకోవాలంటున్నారు శంకరప్రసాద్నువ్వు నేను‘ కవితలో. [/box]

[dropcap]నా[/dropcap] హృదయమంతా వెతికాను
ప్రేమ కాగడా పెట్టి నలుమూలలా
ఎక్కడా నువ్వు కనిపించలేదు

నా మదిలో నువు లేనప్పుడు
పగలూ రాత్రీ నీ తలపే ఎందుకూ.
ఎందుకని ఎంతకని వెతకను నిన్ను

వెతికి వెతికి మనసు చితికింది
ఎక్కడ వెతికినా కనపడవేం..
కానీ ఈరోజే తెలిసింది…

అద్దం ముందు నిలుచున్న నాకు
నీ ప్రతిబింబం కనిపించింది
నేను మాయం అయ్యాను
నువ్వు నామయం అయ్యావు

ఓహో ఇంతకాలం
నన్ను నేను వెతికానా…
నేనే అయిన నిన్ను
నేను వెతికానా…?

Exit mobile version