Site icon Sanchika

నువ్వు!

[dropcap]తె[/dropcap]లియని దొంతరల ఆలోచనల్లో
తెలిసిన పాత్రవి నువ్వు

అనుకోని సంఘటనల జరుపులో
అనుకున్న ఘటనవి నువ్వు

ప్రమేయంలేని ఎడారి నడకలో
అప్రమేయపు సహచరివి నువ్వు

ఎదురుచూపుల సూర్యాస్తమయపు చీకటిలో
ఎదురొచ్చిన నెలవంకవి నువ్వు

ఆరాధనాపూర్వక సంగీత ఝరిలో
జలకాలాడే సరిగమలు నువ్వు

అపరిచితుల మధ్య మెలిగే
సుపరిచిత సుహాసినివి నువ్వు

సేదతీరి యథార్థంలోకి వచ్చి చూస్తే
అద్దంలో కనిపించే నేను నువ్వు !

Exit mobile version