ఓ అయిదు చిన్న కవితలు

1
3

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 5 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

1)

చీకటింకా తెమలలేదు, మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు

పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద

తూర్పు వెలుగులు మోసుకొస్తున్నాయి

——————–

2)

చీకటి ఎప్పటికయినా ముగుస్తుంది

వెలుగు ఎన్నటికయినా మెరుస్తుంది

మనమే సుఖ దుఖాల నడుమ వూగిసలాడతాం

—————————

౩)

ఉదయపు ఆకాశంలో పక్షులు బారులు బారులుగా

తొలి కిరణాలకు దారి చూపుతున్నాయి

పక్కకు తొలగుతున్న మబ్బులకు, కింద నడుస్తున్న నాకూ తెలీదు

——————————–

4)

ఒంటరితనంలో ఉద్వేగం, మాటలు లేవు

సాటి మనుషులూ లేరు

ఎలాంటి భావం లేకుండా ‘కాలం’ గడుస్తూనే వుంది

———————

5)

తెలియకుండానే మనసు పొరల్లో కొన్ని మరుగున పడతాయి

కానిగిరి పాఠాలూ, కన్న కలలూ, తొలి ప్రేమలూ

కాల గమనంలో అట్లా కలిసిపోతాయి, మనమిట్లా మిగిలిపోతాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here