[dropcap]ఓ[/dropcap] గగనమా
ఒక్క మారు వర్షించుమా
ఉరుముల ధ్వనులతో
ఉవ్విల్లూరుతూ వేచి వున్నాము.
మెరుపుల కాంతితో
మురిపించుచుంటివి
ఇక కురిపించు వాన.
చల్లని చిరుజల్లుకై
దాహంతో వేచెను ధరణి
ఎండిన మోడులు, చిగురులు తడవాలని
తహ తహలాడెను.
గగనమా
ఒక్కసారి వర్షించుమా.