Site icon Sanchika

ఓ మిత్రమా నీ కోసమే..!

[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘ఓ మిత్రమా నీ కోసమే..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఓ[/dropcap]డిపోయావని ఉరుకోకు
గెలిచానని చలించిపోకు
అక్కడ ఏదో
గనివిరుగాని సందేశం
ఉందని అనుకోకు
అది నువ్వు రాసిన
రాతై ఉండాలనుకో..
పరిగెడుతున్న
సమయాన గుండె
భారంగా ఉందనినుకోకు
అది నువ్వు వేసి తొలి
అడుగుకు రెట్టింపు అనుకో
కాస్త కష్టంగా ఉందని
జీవితాన్నీ బలి తీసుకోకు
నువ్వు పడే
కష్టం రేపటికి
రెండింతలై
విజయాన్ని గెలుసుకోవచ్చు..
కాదు కూడదు అంటే
నీ కలానికి పదునుపెట్టు
రాతను కవితగా
మలుచు
మరిచిపోకు మిత్రమా
మన జీవితానికి మాటలతో
సరిపెట్టకు కలానికి
పదును పెట్టి
నీ రాతను మార్చుకో
నీ బంగారు భవితకు
బాట వేసుకో..
మిత్రమా చివరగా
నీ మనస్సుతో రాతను మొదలుపెట్టు
ఆ రాతను కవిత్వంతో రుగ్మతలను
తొలిగేటట్టు చేయ్
మరవకు జీవితాన్నీ..
వదలకు ఈ స్వస్థలాన్ని..

Exit mobile version