ఒగ కిత

9
2

[dropcap]”మ[/dropcap]న దేశములా ఓటు విలువ ఎంతరా?”

“500 నింకా 5000 రూపాయలునా”

“అత్తనా కొడకా నేను అడగతా వుండేది ఆ లెక్కలా కాదురా”

“ఇంగే లెక్కనో నాకి తెల్యె. నువ్వే బొగుళునా”

“ఒగ ఓటు పేదోన్ని పెద్దోనిగా చేస్తుంది కొమ్ములు తిరిగిన వాని కాళ్లు యిరగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఇక్కడ దేశ ప్రధాని ఓటు విలువ ఒగటే దరిద్రుని ఓటు విలువ ఒకటే. అదిరా ఓటు విలువంటే”

“అవునా… నా అయితే నువ్వు బుక్కులు బాగా సదివినట్లుండావునా”

“అట్లంటావేంరా నువ్వు”

“నువ్వు చెప్పిందానికి ఇంగెట్ల నాలా, బుక్కుల్లానే ఇట్ల విలువలు బాగా చిక్కేది”

“ఏమిరా నీ లెక్కలు”

“నా లెక్కలు నీకి తెలియాలంటే ఒగ కిత నువ్వు మన దేశములా వార్డు మెంబరుగానో, పంచాయితి తలవరుగానో పోటీ చేయినా అబుడు తెలుస్తుంది నీకి ఓటు విలువ”


ఒగ కిత = ఒక్కసారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here