Site icon Sanchika

ఒకటే మెట్టు

జీవితం,
అది గెలుపు ఓటమిల సంఘర్షణ.
గెలుపు పాఠాన్ని నేర్పితే,
ఓటమి పాఠాన్ని నేర్చుకుంటుంది.
ప్రతి మలుపు గెలుపుకి బాటను వేస్తే
ప్రతి నిర్ణయం అందుకు తోడ్పడుతుంది.
లే, చతికిల బడకు
గమ్యానికి నువు చేరువలో వున్నావ్
ఉత్సాహంగా అడుగేయ్ ముందుకు .
నువ్వెక్కాల్సిందింకా ఒకటే మెట్టు .
నీ పుట్టుక ఒక గెలుపు
నీ మనుగడ ఒక గెలుపు
నీ అస్తిత్వం ఒక గెలుపు .
ముక్కలైన ఆ కుండను చూడు
నీ లా నీరసిoచిoదా !
నూత్న రూపానికి నాంది పలుకుతుంది.
ఇంకా ఆలస్యం దేనికి ?
ప్రణాళికను సిద్ధం చెయ్యు .
పారమార్ధికతకు బాటను వెయ్యు .
వైఫల్యాన్నే స్పూర్తిగా మార్చి,
లక్ష్య సాధనకు బాటను వేసి,
లక్షిత గమ్యం నువ్వు చేరుకో.
లే చతికిల బడకు.
నువ్వేక్కాల్సినది ఇంకా
ఒకటే మెట్టు.

Exit mobile version