[dropcap]ఆ[/dropcap]న్‌లైన్ విద్య
అంతా మిధ్య
టీచర్లకూ పిల్లలకూ మధ్య
కుదరట్లేదు సయోధ్య
అసలైన వ్యాపారాలు
ప్రైవైటు యాజమాన్యాలు
ఫీజుల మాయాజాలాలు
లాప్టాప్‌లో చదువులు
టాప్ లేపే వర్క్‌లు
మ్యూట్‌లో పెట్టి మాటలు
నెట్‌తో తంటాలు
కార్పొరేట్ స్కూల్ కల్చర్
పిల్లలకి పెద్ద టార్చర్
పనిష్మెంట్లతో చేస్తారు ఓవర్
పేరెంట్స్‌కి జర బేజార్
అర్థం చేసుకోలేని చిన్ని బుర్రలు
అర్థం అయ్యేలా చెప్పలేని అధ్యాపకులు
వీరిద్దరి మధ్య నలిగిపోతున్న తల్లి తండ్రలు
పిల్లులకి చెలగాటాలు ఎలుకలకి ప్రాణసంకటాలు