Site icon Sanchika

ఒంటరితనం నాతోనే

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ఒంటరితనం నాతోనే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఈ[/dropcap] నడుమ ఒంటరితనం
నాతోనే వుంటోంది
నేను దాని ఒళ్లో కూర్చుంటున్నాను
పలకరించేవాళ్లు లేకా కాదు
కలిసి కరచాలనం చేసే వాళ్ళు రాకా కాదు
ఒంటరితనం తీగెలాగా
నన్నల్లుకునే వుంటోంది
అప్పుడప్పుడూ ఒంటరితనాన్ని
ఇంట్లో వదిలేసి రోడ్డుమీదికి నడుస్తాను
మార్కెట్‌కి వెళ్తాను థియేటర్ లోకి చూస్తాను
కొనడానికో చూడ్డానికో
సంతోషించడానికో నాకు
అక్కడేమీ కనిపించలేదు
అసహజమయిన వెర్రిమనిషిలా నిలబడిపోయాను
అప్పటిదాకా గమనించనే లేదు
ఒంటరితనం నాకు తెలీకుండానే
నా అనుమతి లేకుండానే నీడలా నా వెంటే నడిచింది
అమ్మయ్య ఒంటరితనం తోడుగా
ఇంట్లోకొచ్చి ఓ పుస్తకం ముందేసుకున్నా
ఆ రచయిత నాతో
సంభాషించండం మొదలుపెట్టాడు
ఒంటరితనం నా పక్కనే కూర్చుని
ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది

Exit mobile version