[dropcap]శ్రీ[/dropcap]మతి యల్లాప్రగడ గారు రచించిన ‘కైంకర్యము’ సంపూర్ణముగా పఠించాను.
సంప్రదాయిక శ్రీవైష్ణవ సంపన్న కుటుంబమును యితివృత్తముగా తీసుకొని వారి జీవనములలో వివిధ సమయములందు జరిగిన సంఘటనలు తన అద్భుత రచనా పటిమతో పాఠకునికి విసుగు రానీకుండా చదివించే శైలితో లోకానుభవముతో రచించారు. ఈ నవలలో ప్రధానముగా సుదర్శనాచార్యులు, అండాళు, రాఘవాచార్యులు, ప్రసన్నలక్ష్మి వీళ్ళను చిత్రించిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉందీ రచన.
ముఖ్యముగా రాఘవను రాఘవాచార్యలుగా మలచినతీరు అత్యంత శ్లాఘనీయము. పవిత్రజీవనము యెడ రచయిత్రి కలము రాఘవ పాత్ర శుచిగా సాగినది.
మొదటిరచనలకు ఈ కైంకర్య నవలా రచనకు విభిన్నముగా కొనసాగినది.
సంధ్యా యల్లాప్రగడ గారిని ఈ సందర్భమున కొనియాడుచున్నాను. రాహుల్ సాంకృత్యాయన్ వలె ఈమె నిరంతరం సంప్రదాయ అన్వేషణలోనూ రచనా వ్యాసంగములందు నిమగ్నులై ఉంటారు. ఉత్తరోత్తరా ఉదాత్తరచనలతో సమాజమునకు చక్కని పవిత్ర సందేశములు ఇస్తారని ఆశిస్తూ వీరికి మంగళాశాసనములు తెలుపుతూ ముగిస్తున్నాను.
ఆర్షవిద్యానిష్ణాత దేవీదాస శర్మ. ఆత్మకూర్, వనపర్తి
***
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/