Site icon Sanchika

ఆరెంజ్ వింటర్

[box type=’note’ fontsize=’16’] పసందయిన ప్రతీకలతో ఒక సున్నితమయిన దృశ్యాన్ని అక్షరాలతో అందంగా గీసిన కవిత దేశరాజు సృజించిన ఆరెంజ్ వింటర్. ఒక శీతాకాలపు ప్రకృతి మనసు కవితలో కనిపిస్తుంది.[/box]

 

రాత్రంతా చలిలో వణికిపోయిన మహావృక్షాలన్నీ..

సిగ్గువిడిచిన గోపికల్లా చేతులెత్తేశాయి

 

గొప్పగా చంకలెగరేసిన పిట్టలన్నీ..

గర్వమణిగిన గండభేరుండాల్లా కువకువమంటున్నాయి

 

ఆలస్యానికి ఆగ్రహించిన పూలేవో..

ముఖం ముడుచుకుని మూతి మూడు వంకర్లు తిప్పుకున్నాయి

 

తొలి కిరణ సంయోగాన్ని అనుభవించిన కొలనేదో..

చాల్లే సంబరమంటూ తరంగాలను వెనక్కునెడుతోంది

 

పొగరెక్కిన పరిమళపు కురులను ముడివేసిన ప్రకృతి..

చెంచలించే చనుదోయిని దాచుకోను తాపత్రయపడుతోంది

 

మాటు వేసిన శీతగాలి కోత ఏదో..

వేకువ దెబ్బకి నాగ్‌పూర్ దాటుతోంది

Exit mobile version