[dropcap]స[/dropcap]మస్యల సుడిగుండాల్లో చిక్కుకున్న మనస్సు
తీరాన్ని చేరలేక తల్లడిల్లిపోతుంది!
ఎదురయ్యే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేక మనస్సు
మౌనాన్ని ఆశ్రయిస్తూ మూగగా రోదిస్తుంది!
అప్పుడప్పుడూ బలవన్మరణాన్ని అందుకోవాలని
ఆరాటప్పడే మనస్సు
ఆ దిశగా చీకట్లని పరిచయం చేస్తుంది!
ఇంతే ఇక భవిష్యత్ జీవితం అంటూ బోధిస్తుంది!
సమస్యల సుడిగుండాలు ఎదురై
నిరాశ నిలువెల్లా కమ్మేసినప్పుడు
తన ఉనికితోటే బాధపెట్టే
అవమానం లాంటి ప్రశ్న ఎదురొచ్చినప్పుడు
మరణమే శరణమని మరో దారంటూ లేదని అనిపించినప్పుడు…!?
నిన్ను నువ్వు నిగ్రహించుకుని
నీ తల వ్రాతను నువ్వే తిరిగి వ్రాసుకో…
జీవితం ఏదో కొత్త పాఠాన్ని నేర్పించబోతుందని గ్రహించాలి!
ఓటమి తొలిమెట్టైతే.. మెట్టుమెట్టు ఎక్కితేనే “లక్ష్యాన్ని”
చేరుకోగలమని తెలుసుకుని మసలుకో నేస్తం!
అప్పటి వరకూ దూరమైన ఆత్మస్థైర్యాన్ని
తిరిగి అందిపుచ్చుకుంటూ ..’ధీమా’గా అడుగుముందుకేయాలి!
చిమ్మచీకట్లు కమ్ముకున్న దారులన్నీ మాయమైనట్లుగా..
“వెలుగుల కిరణాలు” అడుగు అడుగుకి!
విజయదిశ ఇదంటూ తెలియజేతాయి!
చైతనం నీ స్వంతమైతే..
గెలుపు శిఖరాగ్రాన ఎగిరే పతాకం నీదే!
జయహో అంటూ ప్రపంచమంతా కీర్తించే “పేరు” నీదే!