[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) శ్రీరామచంద్ర మూర్తి (5) |
5) ఎవరూ గెలవ లేనిది (5) |
9) వెడలిపోవు (3) |
10) కనులముందే (3) |
12) కొండల సందులో త్రోవ (3) |
13) ఇది లేనివాడు పోకకు కొరగాడు (2) |
16) తిరగబడి వొత్తును కోల్పోయిన మిఠాయి (2) |
17) ఈమెను వారణాసి గ్రామ దేవత అంటారు (3) |
18) బాబాల గారడీని మూఢ భక్తులు ఇలా అంటారు (3) |
19) నిముషంలో సగం, వెనుదిరిగితే యతి (2) |
22) ఏప్రిలుకు కాదు. తరువాత నెలకు గూటము (2) |
23) బావ చెరబట్టిన కిష్కింధా పతి మరదలు (2) |
24) పెద్ద అల (3) |
25) ష ష ష (2) |
26) క్రిందకు రాలు (2) |
29) ‘రోజు’కు ఇటూ అటూ సరిచేయండి, జర (2) |
31) మృతా శౌచము (3) |
32) సనాతనం కాదు. కొత్తది (3) |
33) నెమలి పింఛం (2) |
36) భేకం బాకా ఒకటి (2) |
37) చెదరిన ప్రతాపు (3) |
39) కొత్తది కొని దానితో మొదలయ్యే పాపం (3) |
41) కుండ పీట (3) |
42) హ్మ బ్ర (5) |
43) శుకతాత (5) |
నిలువు:
1) పుట్టిన రూపం, పుత్తడి (5) |
2) పధ్నాలుగో రోజు పండుగ ఈ చతుర్దశి (3) |
3) న్యాయవాదిలోని జాయింటు (2) |
4) పుస్తకం ఒక కాపీ – కింది నుంచి (2) |
5) ఇరుసు (2) |
6) వచ్చుట యను పున్నమి (2) |
7) బుద్ధుడు, విష్ణువు (3) |
8) నాగవల్లీ దళం (5) |
11) వదలినది (2) |
14) ఎడబాటు (3) |
15) శతానందుని తల్లి (3) |
20) పోయినేడు (3) |
21) సహజీవనంలో ఓర్పుండాలండీ (3) |
22) 22 అడ్డానికి కొమ్ము లేదు (3) |
26) తాళికి బదులు అవసరార్థం (5) |
27) ఇది కుదరలేదని చాలా పెండ్లి సంబంధాలు సాగవు (3) |
28) నెల కూలి (3) |
30) మధ్యలో పాదచారితో కర్మసాక్షి (5) |
34) కుసుమంతో విరోధి (3) |
35) గోదావరిలో ఈత; లంక — (2) |
36) బీతు (3) |
38) తిరునాళ్ళలో బండి మీద కట్టే ఎత్తైన వేడుక నిర్మాణం (2) |
39) కదళి, ద్రాక్ష, నారికేళ (2) |
40) ముండ్ల మండ (2) |
41) పవిత్రమైన గరికపోచ (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 28 ఏప్రిల్ 2024 తేదీన వెలువడతాయి.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.