[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) కావేటి రంగని ధామం (4) |
3) లోకులు ఇలాంటి వారట, ఒకటి (4) |
5) సముద్రము, నీటి కుప్ప గదా (4) |
7) తామర (3) |
8) ప్రేమ (3) |
9) మౌక్తికమే, తెలుగులో (4) |
11) తేరునెక్కి పోరు చేయువాడు (4) |
13) వెన్నుని రెండో వేషం (4) |
15) దుస్వప్నము (4) |
17) పదివన్నె బంగారు (4) |
19) తరంగాలతో పూలు (4) |
21) పాత ముచ్చట గుర్తుండుట (3) |
22) చేదు దోస (3) |
23) ఇంగిలీకము (4) |
25) ఈ దేవుడు తను తినబోయే అన్నాన్ని కూడా దానం చేశాడు. ఆఖరి అక్షరం లేదు (4) |
27) ఒక లోహంతో ప్రారంభమయ్యే రవిక (4) |
29) విద్యార్థులు ఇల్లిల్లూ తిరిగి భుక్తి సమకూర్చుకునే పద్ధతి (4) |
31) హే! ఇదొక సంవత్సరం (4) |
33) ఇవి వడ కూడా కలిగి ఉంటాయి (4) |
35) వాడుక – అన్యదేశం- (3) |
36) వచ్చిండన్నా, వచ్చాడన్నా — తెలుగూ ఒకటేనన్నా (3) |
37) వేల్పు చెట్టు – చెట్టు కాదు తీగ (4) |
38) చీకటి రాత్రి (4) |
39) తిట్టు మాట లాడువాడు, తిట్టుబోతు (4) |
నిలువు:
1) భ్రమరావాసము (4) |
2) ముద్దు తోటే ఇదీను (4) |
3) వరుణాశ, పశ్చిమం (4) |
4) శివుడు ఈ వేషంలో వచ్చి అర్జునుని పరీక్షించాడు (4) |
5) ఏడు మోక్షపురాల్లో ఆరోది (4) |
6) కొండ కొమ్ము (4) |
10) నూరు పేటల హారము (3) |
12) గుడిసెకు గౌరవప్రదమైన పేరు (3) |
14) ఆకు పిండగా వచ్చు ద్రవము (3) |
15) పచ్చ వలువ (4) |
16) పవిత్రమనుకునేరు. ఇది కొడవలి (4) |
17) గొలుసుతో ముగిసే అక్కర (4) |
18) తెలుసుకుందామనే ఇచ్ఛ గలవారు (4) |
19) ముండ్లు లేని బాట (4) |
20) కాలుని వాహనము (4) |
24) కాల్చిన పిడక ముక్క (3) |
26) మందిరం (3) |
28) కడుపుష్టిగా ఉంటే గర్భమా (3) |
29) ఎడారిలో, ఎండలు దూరాన నీరున్నట్టు భ్రమింపజేసేది (4) |
30) ఇంటి ముందు ఇది వేస్తే అందం చందం.(4) |
31) హిమగిరి తనయ! (4) |
32) హైదరాబాద్ దమ్ స్పెషల్ (4) |
33) —- పిల్లో! మేం గాజులోళ్ళం గాదా! (4) |
34) పిసినిగొట్టు (4) |
ఈ ప్రహేళికని పూరించి 2024 సెప్టెంబర్ 05వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 15 సెప్టెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-10 జవాబులు
అడ్డం:
1) చిరంజీవి 3) విశ్వంభర 5) అడియాస 7) సరమ 8) వడియ 9) కుస్తుంబరి 11) కంసారాతి 13) సత్యకీర్తి 15) వీధిబడి 17) అరసము 19) మహానసం 21) నిదుర 22) పాయసం 23) వల్లెవాటు 25) దరిమిల 27) తుహినము 29) సౌగంధిక 31) కలయంపి 33) నిద్రముఖం 35) పీలిక 36) పురారి 37) యియాసువు 38) లుకలుక 39) ముద్దుమోము
నిలువు:
1) చిగురాకు 2) విభావరి 3) విధాయకం 4) రసవతి 5) అమవాస 6) సమవర్తి 10) బడబ 12) రాక్షస 14) కీర్తన 15) వీరశైవ 16) డిల్లపాటు 17) అలసంద 18) మునికోల 19) మరమ్మతు 20) సంతకము 24) వారధి 26) మిరియం 28) నడుము 29) సౌరభేయి 30) కరాపువు 31) కనారిలు 32) పిపీలిక 33) నికరము 34) ఖండితము
పద శారద-10 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.