‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) కోతి; వనాల్లో ఉంటుంది గదా (5) | 
| 4) ఆద్యంతాలలో పోవద్దని నిషేధించే వక్క చెక్క (5) | 
| 8) వెలవెలది (2) | 
| 9) గాన యోగ్యమైన ఆలాపన (2) | 
| 11) షిర్డీలోనూ పుట్టపర్తిలోనూ ఉండేవాడు (4) | 
| 13) కైసేత; చివర అనుస్వారం లేదు (4) | 
| 15) నిరక్షరాస్యుని చేవ్రాలు (3) | 
| 17) శోకము, దిగులు (3) | 
| 19) ఇసుక నేల (3) | 
| 21) ఉన్నాడ (3) | 
| 22) పాడువాడా! (3) | 
| 23) హీనజాతి ముత్యము (3) | 
| 24) వర్ష రుతువు (4) | 
| 27) మానవుని స్వభావము (4) | 
| 30) తక్కువ (2) | 
| 31) ఇరు ‘లు’ (2) | 
| 33) మంచి బుద్ధి గల పుడమి (4) | 
| 35) ఎనిమిది వంకరలు గలవాడు (4) | 
| 38) ఒక పంచమా విభక్తి ప్రత్యయం (3) | 
| 40) ఇదొక వర్ణం. ఈ వన్నె గోవులుంటాయి (3) | 
| 42) బేహారి చేయు వృత్తి (3) | 
| 44) తనంత తానే ఉద్భవించిన (3) | 
| 45) తగినంత (3) | 
| 46) పుత్రిక (3) | 
| 47) ఆకాశగంగ (4) | 
| 50) అగ్నిహోత్రుడు (4) | 
| 53) బుభుక్షలోని యుగం (2) | 
| 54) రెండు అంతస్థ అక్షరాలు (2) | 
| 55) మహాంగము (5) | 
| 56) వ్యాయామాన్ని సూచించే జంటపదం (5) | 
నిలువు:
| 2) కటికవాడు (3) | 
| 3) పైకెక్కి వస్తున్న దాసుడు (3) | 
| 5) శివుని భిక్షాపాత్రం (3) | 
| 6) నడుమునకు బిగించుకొను పట్టీ (3) | 
| 7) నదిని దాచుకున్న నవ్యత (5) | 
| 10) తరువాత (5) | 
| 11) తడబడిన వేశ్యావాటిక (4) | 
| 12) అక్క మొగుడు గారు (4) | 
| 13) చిలీ దేశంలోని ఎడారి (4) | 
| 14) స్వారస్యము నెరిగియుండు గుణము (4) | 
| 16) గృహము (2) | 
| 18) అందము; దీనితో గారము కూడా ఉంటుంది (2) | 
| 20) మడి చెక్క(2) | 
| 25) రేణువంత చిన్నది; లేశము (3) | 
| 26) నల్లదనము (3) | 
| 28) లాభాలు కానివి తడబడ్డాయి (3) | 
| 29) వస్త్రము (3) | 
| 32) సూర్యదేవుడు (5) | 
| 33) అరణ్యసీమ (4) | 
| 34) కలత, తొట్రుపాటు (4) | 
| 35) బొబ్బర్లు అనే పప్పు ధాన్యవిశేషము (4) | 
| 36) రాక్షసుడు (4) | 
| 37) ఎల్లప్పుడూ (5) | 
| 39) రుద్రుని కార్యక్రమం (2) | 
| 41) చిన్న పక్షి (2) | 
| 43) శరణు (2) | 
| 48) మంచానికి అల్లే త్రాడు మడతపడింది (3) | 
| 49) దీర్ఘము (3) | 
| 51) తురంగము (3) | 
| 52) ఫేనము (3) | 
ఈ ప్రహేళికని పూరించి 2024 డిసెంబర్ 03వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 08 డిసెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-16 జవాబులు
అడ్డం:
1) కన్యాకుమారి 4) పరివర్తన 8) మాల 9) వల 11) తరితీపు 13) నటనము 15) కాలము 17) త్రోవగ 19) సమిధ 21) మాయల 22) దరనా 23) లలన 24) ముదిప్రాయం 27) చిలకమ్మ 30) గురం 31) ఘుమ 33) మేలుబంతి 35) కువలయం 38) రంజన 40) రురుడు 42) త్రాగుడు 44) గిలాబా 45) పటము 46) గాడిద 47) వసుమతి 50) లువుకురం 53) రగు 54) వాలా 55) విలాసవతి 56) వ్యవసాయము
నిలువు:
2) కుమారి 3) మాలతీ 5) రివట 6) వలన 7) కంచికామాక్షి 10) మూలధనము 11) తములము 12) పుత్రోదయం 13) నగనాచి 14) ముసలమ్మ 16) లయ 18) వర 20) మిల 25) దిగులు 26) ప్రారంబం 28) లఘువ 29) కమల 32) ఫిరంగిపురం 33) మేనబావ 34) తిరుపతి 35) కుడుములు 36) యంత్రాగారం 37) విడుదలకు 39) జలా 41) రుట 43) గుడి 48) సురస 49) మగువ 51) వువావ 52) కులాసా
పద శారద-16 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, తెనాలి
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

