[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) దీనిని పెనుభూతంతో పోలుస్తారు (5) |
5) మనం మాట్లాడేది (5) |
9) వజ్రాయుధం (3) |
10) దీనితో అల్లే మంచాలు ఇప్పుడు తగ్గిపోయాయి (3) |
12) కంచర్ల గోపన్న మేనమామల్లో ఒకడు. తానాషా వద్ద ఉద్యోగి (3) |
13) పెద్దవారు. ఆంగ్లంలో (2) |
16) ఉప్మాకు ముడిసరుకు (2) |
17) విద్యార్థి (3) |
18) బెజ్జము (3) |
19) పెళ్లికాని అమ్మాయా? (2) |
22) రక్షకుడు (2) |
23) ఈ చీరలకు కంచి ప్రసిద్ధి (2) |
24) ధరణి (3) |
25) భ్రాంతి (2) |
26) తిండి, గ్రాసము (2) |
29) అందగాడిలో వంచన (2) |
31) నానుడు వాన (3) |
32) ఓరిమి వంటిదే (3) |
33) మధ్యలో విరిగిన పుల్ల (2) |
36) ఒక నిషాదము – ఒక పంచమము (2) |
37) గర్భవతి (3) |
39) డోసేజి; కొలత (3) |
41) పూర్వం ఈ బీడీలు చాలా పాపులర్. కేతనం (3) |
42) వ్రాయసకాడు (5) |
43) పెళ్ళి కూతురూ, పెళ్ళికొడుకూ (5) |
నిలువు:
1) ప్రియునికై ఎదురుచూచు నాయిక (5) |
2) బ్రహ్మరాత ఇక్కడేనట (3) |
3) ఎవరు చెప్పినా మేమింతే — (2) |
4) పూర్వము (2) |
5) ఆమ్రేడిస్తే – ఉడుకుట యందలి ధ్వన్యనుకరణము (2) |
6) తలక్రిందుగా కమియబండు (2) |
7) ఇదొక బంది, అడ్డంకి (3) |
8) వన్నెచిన్నెల కన్నెమనసులో మెదిలినదిదే – పింగళివారు చెప్పారు (5) |
11) తస్లీమా నస్రీన్ నవల (2) |
14) ఇంద్రుడు చంపిన ఒక రాక్షసుడు (3) |
15) పదిలం (3) |
20) ఆంధ్ర భీష్మ బిరుదాంకితుని ఇంటి పేరు (3) |
21) కప్పలు, గుమాస్తా, ఎన్జీవో నాటకాల రచయిత (3) |
22) శ్రీలలితా శివజ్యోతి సర్వ — (3) |
26) హనుమ, భీముడైనా సరే (5) |
27) రంకుటాలు (3) |
28) మెరిసేదంతా — కాదు (3) |
(30) పతంగులు (5) |
(34) నెమలి; మధ్యలో వొత్తితే ఇంటి ముందు చల్లే పేడనీళ్ళు (3) |
35) లావాదేవీ లెక్కల వివరం (2) |
36) నిప్పు కణిక పై బూడిద (3) |
38) పై కెగసిన పాదం (2) |
39) ఆకులు రాలి, పచ్చదనం కోల్పోయిన చెట్టు (2) |
40) జత (2) |
41) సోదరి భర్త (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 జూన్ 18వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 23 జూన్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-4 జవాబులు
అడ్డం:
1) నారదముని 5) కాద్రవేయము 9) రివరు 10) సినిమా 12) కియారా 13) కేళి 16) తిసు 17) సంపాతి 18) సబిత 19) ముఠా 22) వీడు 23) కూర్మా 24) శార్వరి 25) కూచో 26) వేరు 29) పురం 31) నైషధం 32) ఘరానా 33) శని 36) గానా 37) నవల 39) బోడిక 41) శ్రీనాధు 42) గరికపాటి 43) సిరియాలుడు
నిలువు:
1) నారికేళము 2) రవళి 3) దరు 4) నిసి 5) కామా 6) వేకి 7) యయాతి 8) మురాసురుడు 11) నిన్న 14) కంపాలా 15) అంబిక 20) ఠాకూరు 21) ఊర్వశి 22) వీచోపు 26) వేరుశనగ 27) భిషక్కు 28) మురారి 30) రంగనాధుడు 34) నివరి 35) పాడి 36) గానాలు 38) లక 39) బోటి 40) కసి 41) శ్రీయా
పద శారద-4 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.