[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) నెమలి (5) |
5) అగ్ని (5) |
9) మిక్కిలి ఇచ్ఛ (3) |
10) నీరాజనం (3) |
12) స్త్రీ (3) |
13) చేలలో కోసి ఉంచిన ఓదెల ప్రోగు (2) |
16) రెండు (2) |
17) సొంతిల్లు (3) |
18) అప్పుడప్పుడూ కాదు; ఎప్పుడూ (3) |
19) దప్పిక (2) |
22) వివరముగా చెప్పడం (2) |
23) టాం టాం (2) |
24) జనకస్యపుత్రీ (3) |
25) — మాతరం! (2) |
26) చలివేంద్రము (2) |
29) మేలుకోరునది (2) |
31) మంచి వారితో కలసి మెలసి యుండుట (3) |
32) మరణం (3) |
33) హత్యా? (2) |
36) అనేక (2) |
37) వెన్ను చూపిన లంకాధిపతి (3) |
39) అంతా మన — (3) |
41) రుసుమిచ్చి మిచ్చి కాలకృత్యాలు తీర్చుకునే వసతి కల్పించిన సంస్థ, (ఆఖరరాక్షరం పొల్లు లేదు) (3) |
42) విగ్గేల కృష్ణశాస్త్రికి, ముగ్గేలా తాజమహలు —– లో (ఆఖరక్షరం గుడి లేదు) (5) |
43) కలవరము వలదు. ఇది పారావతము (5) |
నిలువు:
1) అకారణంగా వచ్చే నింద (5) |
2) ల ద్వయంతో లలితాంగి (3) |
3) కృష్ణుని మేనమామ (2) |
4) వశిష్ఠాదుల్లో ఒకడు (2) |
5) పాంశు పరాగం (2) |
6) వృక్ష దళమే! తిరగబడిందంతే (2) |
7) వెదురుబద్దలతో అల్లే దడి (3) |
8) కోడె తో మోదలయ్యే పూవు (5) |
11) నది, ఏరు (2) |
14) మేలుకొలుపు (3) |
15) పైత్యము కాదు, చల్లదనం (3) |
20) దేహళి; తొలి అక్షరం పరుషం చేస్తే – ఒక జిల్లాకేంద్రం (3) |
21) పాడుపడినది (3) |
22) 24 అడ్డమే (3) |
26) ఋశ్యమూక పర్వతశ్రేణి లోని ఒక కొండ. ఇక్కణ్ణించే రాముడు కపులను సమీకరించి లంక పైకి కదిలాడు (5) |
27) ఒడి (3) |
28) దున్నబడనిది – ఒక ముని పత్ని (3) |
30) సాలెపురుగు (5) |
34) నక్క తోక పొన్న (3) |
35) స్త్రీ మొల నూలు (2) |
36) చతుర్థ (3) |
38) అరుదెంచవా (2) |
39) అగ్నిజ్వాల (2) |
40) కెవ్వు (2) |
41) మద్యము (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 జూలై 2వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 07 జూలై 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-5 జవాబులు
అడ్డం:
1.అనుమానము 5. తెలుగుబాస 9. భిదురం 10. నులక 12. మాదన్న 13. సారు 16. రవ 17. ఛాత్రుడు 18. ఛిద్రము/విద్రము 19. కన్యా 22. కాపు 23. పట్టు 24. ధాత్రేయి 25. భ్రమ 26. గాతి 29. దగా 31. ముసురు 32. తాలిమి 33. పుక 36. నిప 37. చూలాలు 39. మోతాదు 41. బావుటా 42. లిపికారుడు 43. వధూవరులు
నిలువు:
1.అభిసారిక 2. నుదురు 3. మారం 4. మును 5. తెక 6. గుమా 7. బాదర 8. సన్నవలపు 11. లజ్జ 14. వృత్రుడు 15. భద్రము 20. న్యాపతి 21. ఆత్రేయ 22. కామద 26. గాడుపుచూలి 27. పాంసుల 28. మేలిమి 30. గాలిపటాలు 34. కలాపి 35. కాతా/ఖాతా 36. నివురు 38. లుకా 39. మోడు 40. దువ 41. బావ
పద శారద–5 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
గమనిక:
పదశారద-5లో అడ్డం 18) బెజ్జము అనే ఆధారానికి చాలామంది జవాబు రంధ్రము అని రాశారు. అయితే నిలువు 15) పదిలం అనే ఆధారానికి జవాబు భద్రము. నిలువు 15 జవాబులో ద్ర – కి ఒత్తు లేని కారణంగా రంధ్రము జవాబు రాసినవారిది సరైనదిగా పరిగణించలేదు.