[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) మీగడ తీసిన పెరుగు (4) |
3) వెన్నెముక (4) |
5) విన్నపమే – మరో రకంగా (4) |
7) పెద్ద అల (3) |
8) గాంధీ ప్రోత్సహించిన గుడ్డ – పొందూరుది ప్రసిద్ధి (3) |
9) అటూ ఇటూ భుజించం. మొత్తానికి అదృశ్యం (4) |
11) పిసినిగొట్టు, బోయవాడు (4) |
13) శివుని వాద్యం (4) |
15) చేసేవాడు కాదు చేయించేవాడు (4) |
17) ఆకాశము (4) |
19) పాక తో మొదలయ్యే మోసగాడు (4) |
21) ఆపద, సహించలేని మాట (3) |
22) క్రైస్తవుల ఆరాధ్య చిహ్నము (3) |
23) నాణెములు ముద్రించు స్థలము (4) |
25) దేవుని ఉత్సవము (4) |
27) పప్పుధాన్యంతో మొదలయ్యే ఒక కీటకం. పోతినేని రామ్ సినిమా (4) |
29) అధికారానికి ఇద్దరు వృద్ధులు పోటీ పడుతున్న అగ్రరాజ్యం (4) |
31) పల్లవుడు కాడు, గోపకుడు (4) |
33) మానవ స్వాభావికం కానిది (4) |
35) తినాలనే కోరిక (3) |
36) మెత్తగా ఉండకుండా, గరుగ్గా ఉండడం (3) |
37) సగటు – నేరుగా (4) |
38) వఱడు (4) |
39) సిగ్గరి (4) |
నిలువు:
1) నలమహారాజు రాణి (4) |
2) జైనులు శరీరాన్ని శుష్కింప జేసుకునే ఒక వ్రతం (4) |
3) వార్తలు (4) |
4) గుండు కలిగిన కలత, క్షోభము (4) |
5) పూలమాల (4) |
6) భీమపాకంతో పాటు ఇది కూడా ప్రసిద్ధి (4) |
10) భూమి (3) |
12) టోపీ. శ్రీనాథుడు కర్ణాట దేశంలో ఇది పెట్టుకున్నాట్ట. (3) |
14) చేతిగుడ్డ (3) |
15) భయంకరమైన విషం (4) |
16) వాయవ్యభారతం లోని ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం (4) |
17) చదువుకున్న స్త్రీ (4) |
18) మునిమాపు సమయం (4) |
19) గోరింట (4) |
20) పై కెగిరిన వైనతేయుడు (4) |
24) ఆంజనేయుడు, భీముడైనా సరే (3) |
26) పుట్ట (3) |
28) ఆంగ్ల హేతువు (3) |
29) ముక్కు పోగు (4) |
30) సంసృతంలో బాణుడు వ్రాసిన వచన కావ్యం (4) |
31) 26 నిలువే ఇది కూడా (4) |
(32) 13 అడ్డమే (4) |
(33) అరుంధతి (4) |
(34) మండ్రగబ్బ (4) |
మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 ఆగస్ట్ 13వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 18 ఆగస్ట్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-8 జవాబులు
అడ్డం:
1.కౌమోదకి 3. అవతంసం 5. కాలవేది 7. వలపు 8. భరణి 9. తములము 11. మనోహరం 13. ముద్రితము 15. తలవంపు 17. మధూలిక 19. ప్రామినుకు 21. రుధిరం 22. తమిస్ర 23. తండులము 25. వనమాలి 27. ముదుకడు 29. ప్రాచీనత 31. ఇమిడిక 33. నివేదిక 35. లులితం 36. వాజమ్మ 37. సరదారు 38. దంపతులు 39. నిరాటంక
నిలువు:
1.కౌగిలింత 2. కిటీభము 3. అరుణిమ 4. సంవత్సరం 5. కాపురము 6. దివాణము 10. లడ్డువం 12. హవేలీ 14. తగును 15. తరళితం 16. పునీతము 17. మధుస్రవ 18. కరువలి 19. ప్రారంభము 20. కుచేలుడు 24. లలన 26. మామిడి 28. కడిది 29. ప్రాచేతస 30. తనవారు 31. ఇరమ్మదం 32. కలువలు 33. నితంబిని 34. కనీనిక
పద శారద-8 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కరణం రామకుమార్
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రంగావజ్ఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.