Site icon Sanchika

పదసంచిక-10

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మధు చిత్తర్వు గారి ఒక వైజ్ఞానిక, కాల్పనిక నవల. (1,1,4)
4. ఆవేష్టకము. తీగలతో నిర్మించిన అడ్డుకట్ట. (4)
7. సగం అప్పడాలుతో కత్తి దెబ్బలనుండి కాపాడుకోవచ్చు. (2)
8. వాకిలి చివరన చిలుక (2)
9. తప్పు చేయడమెందుకు? సరిదిద్దుకోవడమెందుకు? అని అర్థం వచ్చే సామెతలో తొలి సగం. (3, 4)
11. సిద్ధాంత కౌముదిలో స్త్రీమూర్తి. (3)
13. ఇలవేలుపు (5)
14. కపింజలము (5)
15. కాలిన కంపు (3)
18. సకల సౌకర్యాలు కలిగివుండటాన్ని దీనితో పోలుస్తారు. (4,3)
19. అహం కోల్పోయిన మైనాకం మత్తును కలిగియుంటుందా? (2)
21. తవ్వునట్టి సాధనము. పలుగు తోటిది. (2)
22. సూర్యుడొక్కడు, సురరాజులిద్దరు, దినకరద్వయము (4)
23. సీతాకోక చిలుక సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి. (3,3)

నిలువు:

1.బిడాలమట్లు ధ్వనించెడి కోపము. (4)
2.బైబిలులోని మైదానము. (2)
3.60 మైనస్ 1. (5)
5. కొడవలి తోడిది. కమ్యూనిష్టుల గుర్తు. (2)
6. విశ్వనాథవారి నవలారాజము. (4,2)
9. అతిథిని దేవునిగా భావించే మన ఆర్యోక్తి. (3,4)
10. ఈ సుందరి యింటిపేరు లక్కరాజు. (4,3)
11. మరకతమును తిప్పిచూస్తే మొరటు (3)
12.  రాలేని తకరారు. తగవు. (3)
13. ఇలా అయితే పొరబాటు లేదని సముద్రాల సీనియర్ ఉవాచ. (2,4)
16. మహాసింహాసనము కాదు. వంటయిల్లు (5)
17. శిక్ష వేయడానికి మునుపు చేయవలసినది. (4)
20. నాట్యబంధము. (2)
21. ప్రవహించు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా జూలై 28 తేదీన వెలువడతాయి.

పదసంచిక-8 జవాబులు:

అడ్డం:

1.ఆదరాబాదరా 4. శివశివా 7.  మణి 8.  ఖరి 9.  కుండవీనులజోదు 11. గడుసు 13. అవతరణ 14. కదలుమొన 15.నందిత 18. మువ్వన్నియ వేలుపు 19. చవ్య 21. ఇగో  22. రంగవల్లి  23. లలితకళలు

నిలువు:

1.ఆమయావి 2.  దణి 3.  రామానుజుడు 5.  శిఖ  6.  వారిరుహానన  9.  కుండపోతవర్షము 10. దుక్కివాలుతాలుపు 11. గణనం 12. సుకత 13. అగమ్యగోచరం 16. దివియకోల 17. కొనుగోలు 20. వ్యగ 21.ఇళ

పదసంచిక-8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

 

 

Exit mobile version