Site icon Sanchika

పదసంచిక-103

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తెప్ప దాటాక మేలు చేయునది (4)
4. జీడిచెట్టు 60లో 37 (4)
7. Bisonను కొద్దిగా సవరిస్తే వచ్చే వీణ సొరకాయ కొక్కెం (3)
10. ప్రాచీన నాగరికతకు సంబంధించిన అవశేషాల కోసం చేసేది (3)
11. రాధ కంబుకం దీర్ఘంగా తిప్పింది (3)
12. నుడుగులచెలి పెట్టిన మెలిక (2)
14. ఆర్నూరు కుంచాలు (3)
16. ఈ యేడాదికి లకారంలోపించినా గాలి తగ్గలేదు. (2)
17. జనరల్‌గా అడ్డం 4కు దీనికి ఏడేళ్ళు ఎడం (4)
18. ఈ గంధర్వుని వద్ద ధనం దొరుకుతుంది. (4)
19. అలాగే కానీ (2)    
20. కడపటి మోసగాడు (3)
22. పల్చబడిన పూర్వ ఫల్గుణి నక్షత్రం (2)
24. ప్రయత్నం (3)
26. అన్నిరకాల (3)
27. దీని ముందు దీపం పెట్టినట్లని సామెత (3)
29. సంతోషభరితమైన నాలుగవది (4)
30. దీనికి నిలువు 21కి ఆరేళ్ళు తేడా (4)

నిలువు:

2. కుల్లూకభట్టీయములోని వానరం (3)
3. బొత్తిగా లోకజ్ఞానంలేని వాడు కనుకే బోల్తాకొట్టాడు (2)
4. మన్మథ బాణంలో ఎర్రని గుర్రం (2)
5.  కృత్రిమం (3)
6. సూర్యుడు (4)
8. అడ్డం 26తో డేగల అనితాసూరి కవిత్వం (4)
9.  అడ్డం 18 తర్వాత (4)
13. టక్కరి దొంగలో లాక్మే బ్యూటీ (2,1)
14.  కరణము (3)
15.  ఏడుకొండల సామి ఏదాలు చదవాల ___ మల్లన్నేమో సన్నాయి ఊదాల అని ఒక సినిమా పాట (3)
16. హరిద్రాచూర్ణము (3)
19.  నిలువు 8కి ముందు (4)
21.  వజ్రాయుధమును ధరించినవాడా నిన్ను సరిచేస్తే భయకారకమౌతావు. (4)
23. బెంగళూరు నాగరత్నమ్మ పుట్టింది దీన్లోనే (4)
25. కలగాపులగమైన దొంగతనం (3)
26. రసయుక్తంలో నదీ విశేషం (3)
27. ముదితచే నరకబడినది (2)
28. 45యేళ్ళు దాటినవాళ్ళందరూ తప్పక తీసుకోవలసినది (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 04 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 103 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 09 తేదీన వెలువడతాయి.

పదసంచిక-101 జవాబులు:

అడ్డం:   

1.శ్రీకారము 3.ఆకారము 5.మంద 6.రచన 8.నిసి 10.ముట 12.జమున/యమున 14.కాము 15.వత్సరము 16.మత్సరము 17.కేళి 18.డుఉత 20.కంస 22.ముసి 24.గోముఖం 26.పాము 27.కడారము 28.గుడారము

నిలువు:

1.శ్రీద 2.ముర 3.ఆన 4.ముని 5.మందారము 7.చదరము 9.సివరము 11.టవళి 12.జముడు/ యముడు 13.నమత 14.కాముకం 17.కేదారము 19.ఉదరము 21.సవరము 23.సిక 24.గోము 25.ఖంగు 26.పాము

పదసంచిక-101 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version