Site icon Sanchika

పదసంచిక-11

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. చేతిలో రేఖలు చూసి భవిష్యత్తును చెప్పు శాస్త్రం. (6)
4. ______________ ఎదగమని మొక్క నీకు చెబుతుంది అంటాడు చంద్రబోస్. (4)
7. నెలవంకలో భిన్నములోని పై భాగం (2)
8. నంది తిమ్మనలో రాక్షసమాత (2)
9. ప్రవాసి పత్రికా సంపాదకుడు ఈ కాళిదాసు. (3,4)
11. కొల్లూరి సోమశంకర్ కథ తనవి కాని కన్నీళ్లులో నాయిక ఒక professional mourner. (3)
13. ఇది కలికాలమని అనుమానంగా అడుగుతున్నారా? (5)
14. తూర్పు దిశకు, దక్షిణ దిశకు మధ్య దిశ గజిబిజిగా మారింది. (5)
15. పాపం లాలు వెనక్కి చూస్తే దున్నపోతు కనిపిస్తుంది. (3)
18. వరి తన నడుమును…  ఏమిటీ వాచాలత్వం? (7)
19. వెనుక నుండి దిగిన చురకత్తి (2)
21. ఆచూకీ తెలిపిన గురజాడ (2)
22. పుటుక్కు జరజర _________. దీనికి అర్థం తెలియాలంటే తెనాలి రామలింగడు దిగిరావాలి. (4)
23. తగర చెట్టు. (6)

 

నిలువు
1.బలరాముడు లేక కర్షకుడు (4)
2.స్తోత్రం. (2)
3.ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన ఒకానొక తెలుగు సినిమా. (2,3)
5. ఉగాది చివర గోదాము (2)
6. పేరుకు మాత్రమే గొప్ప అసలు విషయం ఏమి లేదని అర్థంలో వాడే ఒక తెలుగు జాతీయము. (2,4)
9. తగిన వరుణ్ణి వెదకడానికి ఇలా ప్రకటన ఇస్తాము. (3,4)
10. బద్దెన కవి కృతి. (3,4)
11. కుమారులు కర్చీపును కలిగి ఉన్నారు. (3)
12.  పందిరి రూపాంతరం చెంది శీర్షాసనం వేసింది. (3)
13. రెండు కథల పృచ్ఛకుడు. (6)
16. తలారి, వనం పదాల కలయికతో బలము. (5)
17. ముక్కలుగానిది, సంపూర్ణము. (4)
20. ఆం.ప్ర. తాజా మాజీ ముఖ్యమంత్రి ఇలా పిలువబడతాడు. (2)
21. గజాననుడిలో కొలత. (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూలై 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా ఆగస్టు 4 తేదీన వెలువడతాయి.

పదసంచిక-9 జవాబులు:

అడ్డం:

1: జనగణమన 4: అసిధార 7: యతి  8: రాగి  9: సామలసదాశివ 11: కుజుడు  13:తల్లాపెళ్లామా 14: తలనీలాలు 15: రికాబు 18: వలక్షమయూఖుడు 19: వాని 21: వాచ 22: రుద్రభూమి 23: మట్టిలోమాణిక్యం.

నిలువు:

1: జయభేరి 2: నతి 3: నరసరాజు 5: ధారా 6: రగిలేగుండెలు 9: సాదనపెనకువ 10: వరూధినీధవుడు. 11: కుమారి 12: డుతబు 13: తప్పులెన్నువారు 16: కాలమహిమ 17: చాకచక్యం 20: నిద్ర 21: వాణి

పదసంచిక-9కి సరైన సమాధానాలు పంపిన వారు:

 

 

Exit mobile version