Site icon Sanchika

పదసంచిక-111

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2. శిశువు భయంతో అరచే ధ్వనితో వచ్చే యూరోపియను (5)
6. సినిమాను సూచిస్తూ తరచుగా వాడే పదం (4)
7. ఈ బెంగాలీ మిఠాయికి అప్పుడెప్పుడో భౌగోళిక గుర్తింపు లభించింది. (4)
8. ఉత్తి బాటిళ్ళు స్మైల్ గారివి. (5)
9. వంచన మధ్యలో కురుచైతే విసదారి ప్రత్యక్షమౌతుంది. (3)
11. కైతికాల కనక సభాపతిలో దాగిన దనుజుడు (3)
13.  ఓర్పులేమి (3)
15. పిల్లనిచ్చి పెళ్ళి చేయాలంటే ఇవి చూస్తారు ఇప్పటికీ చాలామంది. (5)
16. మాఘశుద్ధ సప్తమి తిథిలో వచ్చే పండగ. (5)
17. వనచరము (3)
19. ఒక నాటక భేదం (3)
21. ఎట్నుంచైనా సరే మరామత్తు. (3)
23. అరటాకులో ఆవగాయతో ఈ పర్యాటక ప్రాంతం చూడండి. (5)
25. జీవమున్న గంగ (4)
26. బలవంతమైన వసూలుకు చేయవలసిన క్రియ. (4)
27. ఓటరి. మహిళా ఓటరు అనుకునేరు. (5)

నిలువు:

1. వెనుకటి గొప్పలు తలపోసిన లాభం ____ అంటారు శ్రీశ్రీ. (4)
2. బుక్కపట్నం రసూల్ ఖాన్ వేసుకున్న ముసుగు (3)
3. రామపత్నిని ఎలాగో తన పేరులో ఇముడ్చుకున్న రెవిన్యూ అధికారి.  (5)
4.  చుర చుర చుర చుర కత్తులు. (3)
5. మాత్రకు ముందు ఓ బీజాక్షరాన్ని చేరిస్తే ఒక రకం పిపీలికం. (3)
9. పరపతి ఉన్న బడి (5)
10. అయోమయం గ్లోబు (5)
11.  వైజాగులోని ఉద్యానవనం (5)
12.  ఒక మందు దినుసు. ఐదింట మూడొంతులు నిలువు 11లోనే దాగి ఉంది. అధిక కాంతిని జోడిస్తే సరి. (5)
13. కిమ్మతు (3)
14.  సంధ్య (3)
18. రంకు తిరిగిన సంగీతరాగవిశేషము (5)
20. దళారీ (4)
22. బోసినోటివానికి దీని మీద ప్రీతి ఎక్కువట. (4)
23. టెంకాయ చిప్ప గరిటె. (3)
24. సమవర్తి (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 29 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 111 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూలై 04 తేదీన వెలువడతాయి.

పదసంచిక-109 జవాబులు:

అడ్డం:   

1) ఇబ్బడి 3) పునాది 5) ఏతాము 7) కానూను 8) సవ్వడి 9) టపాల 11) డిక్కితొ 13)కులుకులమ్మి 16) అసతోమా 18) దరిహుయా 20) రవ 21) జాడీ 22) తేయపస్వా 25) కోతిమంద 27) మిర్యాలరసం 30) పికము 32) పిచిక 34) నమ్రత 35) కళ్ళాపి 36) తడక 37) మిడత 38) సిదారం

నిలువు:

1) ఇసుంట 2) డికాల 3) పునుగులు 4) దిసమొల5) ఏడిడి 6) ముచ్చెతొ 10) పాయస 12)క్కిళహు 13) కుమారస్వామి 14) కుథ 15) మ్మిదడీకోసం 16)అయితే 19) యాపద 23) యజ్ఞిక 24) దూల 26) మంఆచి 28) ర్యాఅంతమి 29) రసికత 30) పిడత 31) మునక 32) పిపిసి 33) కప్పురం

పదసంచిక-109 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

~~

109 పదసంచికలో ఒక ప్రత్యేకత ఉంది. అడ్డం సమాధానాలను వరుసగా పేర్చి ఒక క్రమ పద్ధతిలో అక్షరాలను ఎంచుకుంటే వాటితో ఒక అర్థవంతమైన వాక్యం వస్తుంది. అది:

ఇది నూటతొమ్మిదవ పదసంచిక కదా

Exit mobile version