Site icon Sanchika

పదసంచిక-113

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తిరుపతి నుండి తిరుమలకు ఈ మార్గం కూడా ఉంది. (5)
4. కులం అంటే దురభిమానం ఉన్నవాడు. (5)
7. భువన విజయానికి పోటీగా కవన విజయం అనే సాహిత్య రూపకాన్ని  సృష్టించింది వీరే. (5,6)
8. గాజువాక మండలములో  లభ్యమయ్యే బైరాగి సరంజామా (5)
9. టేకుమళ్ల రంగడు దాచిపెట్టిన నారీతరంగుడు (5)
10. హరినివాసము (5)
12. మానస, రాధలు కలిసి చేసే సామూహిక భోజనం (5)
14. నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కాస్త ముందూవెనక, అటూ ఇటూ జరుగుతాయి. (5,3,3)
15. అడ్డం 7 ఆయన పాటలు వ్రాసిన ఒక సినిమా (2,3)
16. మాతాపితరులు సంధి కుదరక పరుషం ఐనారు. (5)

నిలువు:

1. పొయెటికల్ హీరోయిన్ (5)
2. తెలుగు సంవత్సరాలలో సౌమ్య. (6,5)
3. వరకట్నము కాదు సముద్రతీరంలో ఉన్న పట్టణము (5)
4.  చాసో కథలలో ఒకటి. కాహళంతో మొదలు. (5)
5. కిళాంబి గోపాలకృష్ణమాచార్యులు రచించి రావు వేంకటకుమార మహీపతి సూర్యారావుకు అంకితమిచ్చిన గ్రంథం. పేరులో తొలి నాలుగు అక్షరాలు మాత్రం తడబడ్డాయి. (4, 4,3)
6. ఆస్తికుల నమ్మకం తడబడింది. (5)
10. వ్యక్తుల స్వరూప స్వభావాలను, ధోరణులను వాస్తవానికి వీలయినంత దగ్గరగా పాత్రలలో ప్రతిబింబించడం.(5)
11. త్రిపాది (5)
12.  భాష, మతం, ఆచారం, సాంప్రదాయాలు, చరిత్రలతో బంధం కల ప్రజలు అనే అర్థాన్నిచ్చేది. (5)
13.  అసలు కాని దానితో ఆకలి బాధ (5)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూలై 13 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 113 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూలై 18 తేదీన వెలువడతాయి.

పదసంచిక-111 జవాబులు:

అడ్డం:   

2.బుడతకీచు 6.వెండితెర7.రసగుల్లా 8.ఖాళీసీసాలు 9.పన్నగం 11.కైకస 13.విరుపు 15.కులగోత్రాలు 16.రథసప్తమి 17.వనాట 19.డిమము 21.రిపేరి 23.అరకులోయ 25.జీవగంగ 26.ముక్కుపిండు 27.పరాజితుడు

నిలువు:

1.బండిసున్న 2.బురఖా 3.తహసీల్దారు 4.చురలు 5.అంగుళిక 9.పలుకుబడి 10.గంద్రగోళము 11.కైలాసగిరి 12.సలామిసిరి 13.విలువ 14.పురట 18.నాటకురంజి 20.మధ్యవర్తి 22.పేలపిండి 23.అగప 24.యముడు

పదసంచిక-111 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version