Site icon Sanchika

పదసంచిక-16

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శృంగేరి శారదా పీఠము వారి ఆధ్యాత్మిక మాసపత్రిక (1,3,2).
4. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కావ్యము (4)
7. నాలుకతో రుచి చూస్తున్న నాగకుమారి (2)
8. మెరుపును చూడాలన్నా, శంఖధ్వనిని వినాలన్నా పాశాన్ని తిరగేయాలా?(2)
9. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో సామల రమేశ్‌బాబు నడిపిన మాసపత్రిక. (4,3)
11. జ్యోతిరావు ఫూలే భార్య. (3)
13. తత్సమపదములు కలియని స్వచ్ఛమైన తెలుగు భాష. (5)
14. మన్మథుడు (5)
15. మహమ్మదీయుడు తడబడ్డాడు. (3)
18. రసజ్ఞులలో ప్రముఖుడు. (7)
19. లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో 1999 వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ విజేత (2)
21. నడిపించు నా ________ నడి సంద్రమున దేవ మాసిలామణి పాట (2)
22. కర్ణాటక సంగీతంలోని మొదటి మేళకర్త రాగము (4)
23. భారతంలో ప్రేమకథలను వెలికితీసిన రచయిత్రి. (3,3)

నిలువు

1. కాశీఖండం కావ్యకర్త (4)
2. ప్రముఖ తెలుగు కార్టూనిస్టు ఎస్.బి.శంకర్ కుమార్ ఇలా సుప్రసిద్ధుడు.(2)
3. పారాసైట్ (5)
5. కీర్తి (2)
6. మధురాంతకం రాజారాం గారి ఒక పేరుగాంచిన కథ. (3,3)
9. యండమూరి వీరేంద్రనాథ్ నవల (3,4)
10. నాసిక్ సమీపంలోని జ్యోతిర్లంగ ఆలయంలోని దేవుడు. (7)
11. కనిష్ట సామాన్య గుణిజం కిందామీదా అయ్యిందా? (3)
12.  భగవంతం కోసం, జర్కన్ కథల రచయిత (3)
13. లేఖిని (6)
16. అగ్నిదేవుడు (5)
17. అభ్రమువు అను ఆడయేనుగు. (4)
20. ఆకురాయి (2)
21. దినారములోని పీచు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను సెప్టెంబరు 3వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 8 తేదీన వెలువడతాయి.

పదసంచిక-14 జవాబులు:

అడ్డం:

1.అలమేలు మంగ 2.మురహాఆ 7.సజ్జ  8.రంకు  9.అబ్బూరి ఛాయాదేవి  11.గండుక  13.సంపెంగ దండ 14.అగ్రతాంబూలం  15.కంజీర 18.మంగళా శాసనము  19.స్యలా  21.ఊహ  22.లుకలుక 23.ముత్యమంత ముద్దు

నిలువు:

1.అసవస   2.లజ్జ    3.గముఛాఖుడు   5.హారం  6.ఆకు రాలు కాలం  9.అనురాగ‌ సంగమం  10.విలయ తాండవము 11.గండకం 12.కఅర  13.సంధ్యా సమస్యలు   16.జీవశాస్త్రము  17.సరిహద్దు  20.లాక  21.ఊము.

పదసంచిక-14కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version