[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కాళిదాసుదో, నన్నెచోడుడిదో కావచ్చు. రావూరి భరద్వాజదో, ఎమ్మెస్వీ గంగారాజుదో కూడా కావచ్చు. (6) |
4. తేనెమామిడి కావాలంటే A.V.మాల ను అడగండి. (4) |
7. రెండణాలు (2) |
8. ఎదురు జవాబులో జాడ్యము. (2) |
9. మండనమిశ్రుని భార్యతో వాదంలో గెలుచుటకు ఆదిశంకరాచార్యులు చేసినది. (4,3) |
11. మునిమాణిక్యం వారి అబ్బాయి. ప్రఖ్యాత కథకుడు. పొట్టిపేరుతో. (3) |
13. 24వ జైన తీర్థంకరుడు (5) |
14. కేనోపనిషత్తు. (5) |
15. మిక్కుటమైన ఆసక్తి. (3) |
18. వాణిజ్యము (7) |
19. కపటం (2) |
21. ఉన్మాది. కనిపిస్తే పీక కోసై. (2) |
22. డూ డూ బసవన్న. (4) |
23. గురజాడ గేయ ఖండికల సంపుటము (6) |
నిలువు
1. గచ్చకాయ (4) |
2. రెండ్రూపాయలు (2) |
3. పంకజముఖి సీత లాంటి భామామణితో పోల్చదగినది. (5) |
5. తడవ (2) |
6. హంపి (6) |
9. అత్యున్నత సైనిక పురస్కారం (3,4) |
10. శివుని గూర్చిన పాటలు. (7) |
11. కడుపు మీద వళి వుందంటే తడుముకోవాలా? (3) |
12. అంత క్లేశమెందులకు తనయా? (3) |
13. యండమూరి నవలాత్మక చిత్రము (3,3) |
16. శత్రువులను లోబరచుకోవడం శౌర్యమేనా? (5) |
17. ప్రశంస (4) |
20. రీతి (2) |
21. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను అక్టోబరు 15వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా అక్టోబరు 20 తేదీన వెలువడతాయి.
పదసంచిక-20 జవాబులు:
అడ్డం:
1.అంబరు చరఖా 4.మోటబావి 7.చరి 8.మాట 9. వేంకట సీతాపతి 11.ఉలుకు 13. కవీశ్వరుడు 14.పరిణామము 15.మునులు 18.మిణుగురు పురువు 19.రాసి 21.పోటీ 22.వుద్ధరిణి 23.గుహ్యకేశ్వరుడు
నిలువు:
1.అంచబాబా 2.బరి 3.ఖాళీసీసాలు 5.బామా 6.విటతాటనము 9.వేంకటేశ్వర స్వామి 10.తిరుకణామధువు 11ఉడుము 12.కుపలు 13.కత్తి పద్మారావు 16.నుసిరుపుగు 17.మావటీడు 20.సిద్ధ 21.పోరు
పదసంచిక-20కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- అర్క సోమయాజి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రాజేశ్వరి కనకగిరి
- సుభద్ర వేదుల
- శుభా వల్లభ
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.