[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నా కొడుకో కొమురన్న దొర జర భద్రం అని గూడ అంజయ్య కలం నుండి జాలువారిన అమ్మపేగు పాట (3,3) |
4. వాతాపి మహిమలో నానమ్మ (4) |
7. పతనాంతమున చాకలి బట్టలు ఆరవేసుకునే తాడు కనిపిస్తుంది. (2) |
8. దశ రూపకాలలో ఒకటి. నాటక భేదము. (2) |
9. “దుక్కి” దున్నిన వర్తమాన కళింగాంధ్రకవి. (2,5) |
11. తడవకు ఓ గుణింతం చేర్చి తిరగేసినా అర్థం మారదు. (3) |
13. సంస్కృత ఢంకా (5) |
14. ఉపకారికి ఉపకారము చేయడం _____ కాదు అంటాడు సుమతీ శతకకారుడు (5) |
15. గంగకు బ్రహ్మను జోడించినా గంగే. (3) |
18. శ్రీరాముడు చేసిన యాగం కుడి నుండి ఎడమకు (7) |
19. ఒప్పుల”కుప్ప” ఈ సినీ నాయిక (2) |
21. మునగ వద్దంటున్న శూకకీటకము (2) |
22. నవధాన్యాలలో ఒకటి (4) |
23. సూర్యుడు. చెమటలు పట్టించేవాడు కదా! (6) |
నిలువు:
1. (జలములో) తడుపము అంటున్న జలధిజుడు. (4) |
2. దసరా వస్తే అందరూ ఇది అడుగుతారు. (2) |
3. త్రికూటాచలముగా ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రము (5) |
5. వరిపొలము (2) |
6. ఏవి తల్లీ నిరుడు కురిసిన శ్రీశ్రీ ప్రశ్నించిన ______ ? కానీ ఒక్కటే! (6) |
9. కంచెర్ల గోపన్న సీతమ్మ తల్లికి చేయించిన ఆభరణము (3,4) |
10. శివుడే శీర్షాసనం వేశాడు (7) |
11. పక్షి (3) |
12. చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి సృష్టించిన సాహిత్యప్రక్రియ (3) |
13. విశ్వనటచక్రవర్తి బిరుదాంచితుడు (6) |
16. తలలోని వివిధ భాగాలకు మంచి రక్తాన్ని పంపే రక్తనాళము(5) |
17. శ్రీకృష్ణుడి క్లాస్‌మేట్ (4) |
20. పెద్దబాలశిక్షలోని రాయి (2) |
21. మరుతేజి ఎక్కిన రథము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 5వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 10 తేదీన వెలువడతాయి.
పదసంచిక-23 జవాబులు:
అడ్డం:
1.విజయదశమి 4.మాళవశ్రీ 7.పిన్ని 8.పదే 9.సుమనోభిరంజని 11.సుముఖ 13.జంగందేవర 14.చిమ్మనగ్రోవి, 15.తిపత 18.లాభసాటిబేరము 19.దడి 21.పాకి 22.రిక్కఱేడు 23.మలయవాసిని
నిలువు:
1.విపినము 2.జన్ని 3.మిశ్రభిన్నము 5.వప 6.శ్రీదేవిభూదేవి 9.సుభద్రాదేవిశీలా 10.నిరశనవ్రతము 11.సురతి 12.ఖచిత 13. జంపాలచౌదరి 16.పల్నాటిసీమ 17.పినాకిని 20.డిక్క 21.పాసి
పదసంచిక-23కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కల్యాణి యద్దనపూడి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.ఝాన్సీరాణి
- పొన్నాడ సరస్వతి
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.