పదసంచిక-28

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. భారతి మాసపత్రికలోని ఒక శీర్షిక (6)
4. తెలుగు ఫ్యాను (4)
7. తరాసులో తనూజ (2)
8. ఇహత్యకములో వధ (2)
9. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన పత్రిక (4,3)
11. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుని ఇంటిపేరు (3)
13. ఉరిలో కంప నాకలోకాన్ని చూపిస్తుంది. (5)
14. పర్షియా దేశానికి చెందినది (5)
15. ఉత్పత్తిదారునికి బజారులో వర్తకునికి మధ్య కొంత కమీషను పుచ్చుకొని పనిచేయు మధ్య మనిషి (3)
18. ఈ మధ్య రాజకీయ పార్టీలలో ఎటుచూసినా విభేదాలు కాస్త ఎక్కువగానే తలెత్తుతున్నాయి. 🙂 (7)
19. చూపు (2)
21. భూషణములో భూషణము (2)
22. దశరథుని పుత్రుడు తిరగబడ్డాడు (4)
23. ఋషి డంబాచారంతో ఉపవాసము  (6)

నిలువు

1. గాయక సుధానిధి వద్దనున్న పచ్చికాయ. (4)
2. మోహనవంశీ నవలా రచయిత్రి (2)
3. జూదపు పలక (5)
5.  సమాహర్త మధ్యలో గోవు (2)
6.  నిత్యకళ్యాణము కాదు నిద్ర (6)
9.  బి.వి.ఎస్.రామారావు వ్రాసిన కథల పుస్తకం (4,3)
10. కలహశీలుని జెండర్ మారింది. (7)
11.  మీ కంద కాదు మామిడి (3)
12.  పణ్యాజీవుడు (3)
13.  ఆకాశము. నక్షత్రాల బజారు. (6)
16.  కకావికలైన కళాఖండము (5)
17.  వేకువజాము (4)
20.  భీకరమైన తీరము (2)
21.  నడిమి లేని భూమిజ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 01 తేదీన వెలువడతాయి.

పదసంచిక-26 జవాబులు:

అడ్డం:

1.రేపటి కొడుకు 4. శీఘ్ర కోపి 7. చిత్రం 8. డిల్ల 9. ఋణానంద లహరి 11. టముకు 13. దేవగణిక 14. బుక్కా పకీరు 15. ముడాసం 18. మరదలు వరుస 19. కపి  21. కప్ప  22. ముసల్మాను  23. చుక్కల్లో చంద్రుడు

నిలువు:

1.రేచితము  2.పత్రం 3.కుదోదరము 5.కోడి  6.పిల్ల జమీందారు 9. ఋష్యశృంగర్షిహమ  10. రిగమపదనిస 11.టకము 12.కుబుసం 13.దేహధారకము 16.డాగులువైచు  17.తిమ్మప్పడు 20.పిస 21.కద్రు

పదసంచిక-26కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • తాతిరాజు జగం

వీరికి అభినందనలు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here