‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. సోమరసపు మాత్ర అనవచ్చా (3,3) |
| 4. లియోనార్డో డావిన్సీ చిత్రించిన సుందరి (4) |
| 7. 2 నిలువే. ద్రాక్ష.(2) |
| 8. మిలమిల లాంటి సగం మెరుపు (2) |
| 9. స్వారోచిష మనుసంభవ కావ్యకర్త (4,3) |
| 11. సందెకాడ (3) |
| 13. చంద్రుడు. కలువ ఫ్రెండు కదా! (5) |
| 14. ప్రకాశించుచున్న సభా విమానం (5) |
| 15. ఎదురొచ్చిన టెక్కెము (3) |
| 18 నరముమీది పుండు ఇదీ మననీయవని లోకోక్తి. ఆ ఇది ఇక్కడ వెనుతిరిగింది. (7) |
| 19. వాసనలో వృష్టి (2) |
| 21. పేతురు కలిగివున్న నామధేయము (2) |
| 22. ఉత్తర అమెరికాలోని జలపాతం (4) |
| 23. ముద్దూ ముచ్చటా బహువచనంలో (6) |
నిలువు
| 1. వేదములు చదువని వాడు (4) |
| 2. 7 అడ్డమే. ద్రాక్ష (2) |
| 3. కారా మాస్టారు గారి అడ్రసు. (5) |
| 5. జిలిబిలిజిల్లిలో తెరమరుగైన ఒక సినిమా నటి (2) |
| 6. అమృతాన్ని సాధించడానికి దేవదానవులు చేసింది (3,3) |
| 9 వనవాసి (3,4) |
| 10. కైకాల సత్యనారాయణ దీనిలో సార్వభౌముడా? (4,3) |
| 11. మరదలు (3) |
| 12. పరిశుద్ధము శీర్షాసనం వేసింది. (3) |
| 13. నైరుతి రుతుపవనముల రాకతో కురిసిన మొట్టమొదటి వాన (4,2) |
| 16. ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములు (5) |
| 17. సురులు కానివారు (4) |
| 20. 22 అడ్డంలోని నూతనము (2) |
| 21. ఉపనగరము(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 08 తేదీన వెలువడతాయి.
పదసంచిక-27 జవాబులు:
అడ్డం:
1.పౌరసరఫరా 4.పాదుషాహి 7.లక్ష 8.పుర 9.అభినవపోతన 11.కానిక 13.ఆదివారము 14.రెంటికిపోవు 15.కసటు 18.తిక్కనసోమయాజి 19.దుని 21.పుంత 22.భిషజుడు 23.లులాయధ్వజుడు
నిలువు:
1.పౌలస్త్యుడు 2.రక్ష 3.రాగవర్ధని 5.షాపు 6.హిరణ్యబిందువు 9.అక్షరవాచస్పతి 10.నబతికికాలేజి 11.కాముక 12.కరెంటు 13.ఆనకదుందుభి 16.సరసోక్తులు 17.బుడతడు 20.నిష 21.పుంజు
పదసంచిక-27కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- బావాజి ఎర్రమిల్లి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పి. ఝాన్సీరాణి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పార్వతి వేదుల
- శుభా వల్లభ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
















