Site icon Sanchika

పదసంచిక-40

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఎంతనేర్చినా ఎంతజూచినా ______ కాంతదాసులే అని త్యాగరాజు అభిప్రాయం. (6)
4. ఏదో ఒకటి తేల్చుకోవడం (4)
7. ముద్దకోసం అడవిపిల్లిని అడగాలా? (2)
8. కోవెల అట్నుంచి (2)
9. యుగయుగాల దోపిడిలో, నరనరాలరాపిడిలో శ్రీశ్రీ చేయమన్నది. (చూడు మహాప్రస్థానం)(2,2,3)
11. బుద్ధుని శిష్యుడు. సాధనలో పురోగతిని సాధించినవాడని పరమార్థము. (3)
13. అంతర్జాలపు స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వం (5)
14. భీముడో, ఆంజనేయుడో (5)
15. పసులు (3)
18. చైత్రమాసము (5,2)
19. ధర్మాసుపత్రిలో కాటుక లాంటిది తిరగబడింది. (2)
21. త్రాగుడులో పాశము (2)
22. తుంగబుర్ర జోడీదారు (4)
23. ఇన్‌స్ట్రుమెంటు (5)

 

నిలువు

1. మరీచిక (4)
2. జనయిత్రి (2)
3. నండూరి వారివి ఎంకిపాటలైతే సాదనాల వేంకటస్వామి నాయుడు గారివి _____ పాటలు (5)
5. వృత్తపరిధి సూత్రంతో బంగారం (2)
6. ఆచంట జానకీరామ్ గారి జీవితచరిత్ర (4,2)
9.  దారువాహికలలో నుండి పోషక ద్రావణములు పైకెక్కునపుడు కలుగు ఒత్తిడి (7)
10. చిగుళ్లు శీర్షాసనం వేశాయి. (7)
11.  ఈ షిండేగారు తెలుగు చిత్రసీమలో కామెడీవిలన్ పాత్రలకు పెట్టింది పేరు. (3)
12. వింతకృత్యము (3)
13. పాలక పక్షం ప్రవేశపెట్టే తీర్మానం (3,4)
16. దున్నపోతు (5)
17. నెఱి+నడుము = (4)
20. మంచి నడక కలవాడు అథవా చక్కగా పాడునది. (2)
21. బలము, శక్తి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 23 తేదీన వెలువడతాయి.

పదసంచిక-38 జవాబులు:

అడ్డం:                                 

1.గొంతెమ్మ కోరిక 4.అతిపంచా 7. జర 8. దాట్ల 9. భవిష్య పురాణము 11. జక్కవ. 13. ఎల్లరికమ్మ 14. నిర్వాసితులు 15. వాసత 18. ముకుందరామారావు 19. కమ 20. జమ 22. టిట్టిభము 23. నలదమయంతి

నిలువు:

1.గొంజకత్తె 2. తెర 3. కలుపుమొక్కలు 5. పందా 6. చాట్ల శ్రీరాములు 9. భద్రాపరిణయము 10. ముసిముసి నగవు 11. జమ్మవా 12. వనిత 13. ఎనభై ఒకటి 16. సమారాధన 17. భానుమతి 20. మట్టి 21. జయం

పదసంచిక-38కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

 

Exit mobile version