‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. పులుపు రుచికల బ్రాహ్మణుడు (6) |
| 4. అడివి బాపిరాజు గారి ముద్దుపేరు (4) |
| 7. గుబ్బిలి దాచుకున్న ధనము (4) |
| 8. కెరటం లేని ఆయాసము కపటాన్ని సూచిస్తుంది. (2) |
| 9. దేవతల డాక్టర్లు (7) |
| 11. కాపీ (3) |
| 13. ఈ నరుడు అగ్నిదేవుడు (5) |
| 14. రాతితునక రాగులకయి వెదకండి. (5) |
| 15. దారాదములో డిస్కౌంటు (3) |
| 18. ఈ చదువులు లేతవి కావు. వేదాలు (7) |
| 19. రమను వెనకనుంచి పిలిస్తే మన్మథుడు పలుకుతాడేమి? (2) |
| 21. పంచాననము కడుపులో పడతి (2) |
| 22. అల్పాచమానము (4) |
| 23. మురళీమోహన్, జయచిత్ర నటించిన ఒక దాసరి సినిమా (6) |
నిలువు
| 1. పెరుగన్నంలో పెరుగుంటుంది కానీ ____లో పులిఉండదు అని సినిమా డైలాగు (4) |
| 2. బరిణె (2) |
| 3. పూదోట (5) |
| 5. బానిస చేసే ప్రతిజ్ఞ (2) |
| 6. బాలకృష్ణుడు (6) |
| 9. నిష్ప్రయోజనము (7) |
| 10. ఆ పార్టీలో అంతర్గత విబేధాలు కాస్త ఎక్కువ మొదలయ్యాయి. (7) |
| 11. కటి (3) |
| 12. తైదలు ఉల్టా అయ్యాయి (3) |
| 13. కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన సినిమానటి (6) |
| 16. చెల్లాచెదురైన చెస్ (5) |
| 17. కపటము లేని నవ్వు (4) |
| 20. ఈ బాబు గిరిబాబు కొడుకు (2) |
| 21. జత (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 15 తేదీన వెలువడతాయి.
పదసంచిక-41 జవాబులు:
అడ్డం:
1.అల్లుడామజాకా 4.మధులిహ 7.వడ 8.రాను 9.మత్తేభవిక్రీడితం 11.దర్శని 13.శాలిహోత్రము 14.పన్నీరుబుడ్డి 15.కువము 18.యతిరాజవిజయం 19.డస 21.పూట 22.లిఖితము 23.మునిభేషజము
నిలువు:
1.అవకాశం 2.ల్లుడ 3.కావ్యవిమర్శ 5.లిరా 6.హనుమంతరెడ్డి 9.మహామహోపాధ్యాయ 10.తంజావూరువిజయం 11.దముకు 12.నిపము 13.శాసనమండలి 16.వధూజనము 17.చౌపటము 20.సఖి 21.పూజ
పదసంచిక-41కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అభినేత్రి వంగల
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- రామలక్ష్మి
- సరస్వతి పొన్నాడ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.















