‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. లేడీ అమితాబ్ పిన్ని ఈ లేడీ జేమ్స్‌బాండ్ (6) | 
| 4. భిక్షాపాత్ర కోసం వసనాభి గుణింతాలు మార్చి సరిచేయండి. (4) | 
| 7. పాకంపప్పు (2) | 
| 8. డాక్టర్ కళ్యాణిగారివిజృంభణ (2) | 
| 9. అకాడమీ ప్రైజు గెలుచుకున్న సాహిత్యాకాశంలో సగం రచయిత్రి (4,3) | 
| 11. సాధారణంగా జానపద కథల్లో రాక్షసుడి ప్రాణం ఇందులో ఉంటుంది. (3) | 
| 13. బ్రాంచి కెనాలు(5) | 
| 14. తొమ్మిదోనెల (5) | 
| 15. నీరజను లోహపుపొడి తెమ్మంటావా? (3) | 
| 18. ఘంటసాల బలరామయ్య నిర్మించిన 1946 నాటిచిత్రం. (3,4) | 
| 19. వేవేవే(2) | 
| 21. పాలతో తండ్రి (2) | 
| 22. డీడిక్కులాట ఆడే జిత్తులమారి (4) | 
| 23. come, come అని పిలుస్తున్న మధురమైన ధ్వనిగల స్త్రీ. (6) | 
నిలువు
| 1. ట్రీట్మెంటుతో సందేహం. (4) | 
| 2. అక్కిరాజు జనార్దనరావు ఎక్కిన గుర్రము (2) | 
| 3. వెంకన్నకు భక్తులు సమర్పించుకొనేది (5) | 
| 5. ఇది దొరికింది గుర్రం కొనమన్నాడట వెనుకటికొకడు (2) | 
| 6. తాత కలము రాసిన పులినతలము (6) | 
| 9. రెండు కారణాల శివుడు (7) | 
| 10. ఉత్పలవారి దృష్టిలో హైదరాబాదు సికిందరాబాదు నగరాలు (3,4) | 
| 11. చిట్టచివరలో చివర (3) | 
| 12. ఆర్చి (3) | 
| 13. రామాయణంలో ఏమిటి? (4,2) | 
| 16. కమల, జలజాక్షిలతో జలూక (5) | 
| 17. తూర్పు ఆఫ్రికా దేశంతో వేదాధ్యయన సంపన్నుడు. (4) | 
| 20. ఆంగ్ల చూపుతో సంస్కృత వెలితి (2) | 
| 21. గణపతి క్షేత్రం చివర బెల్లంతో చేసిన చిక్కని ద్రవం (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 29 తేదీన వెలువడతాయి.
పదసంచిక-43జవాబులు:
అడ్డం:
1.పుడమివేలుపు 4.బాపిబావ 7.లిబ్బి 8.సట 9.ప్రవరవాహనులు 11.నకలు 13.వైశ్వానరుడు 14.గులకరాయి 15.ముదరా 18.ముదురుచదువులు 19.మార 21.చాన 22.లఘుశంక 23.ముద్దబంతిపువ్వు
నిలువు:
1.పులిహోర 2.డబ్బి 3.పుష్పవాటిక 5.బాస 6.వటపత్రశాయి 9.ప్రయోజనశూన్యము 10.లుకలుకలుకలు 11.నడుము 12.లుగురా 13.వైజయంతిమాల 16.దరంచగము 17.పాలనవ్వు 20.రఘు 21.చాపు
పదసంచిక-43కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఈమని రమామణి
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

