‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. కాంతారావు శ్రీకృష్ణునిగా నటించిన 1967 సినిమా (6) | 
| 4. అనేక రకాల కూరగాయలు వేసి వండిన పులుసు (4) | 
| 7. అందాలరాశి సినిమాలోని అందాలరాశి (2) | 
| 8. కొత్తరికములో కల్ల (2) | 
| 9. శ్రీకృష్ణదేవరాయని బిరుదు (7) | 
| 11. జడముడికై వాయిదాన్ని పట్టుకు రండి. (3) | 
| 13. పెళ్ళంటే _____ అది పండాలీ కోరుకున్న వారి ఇంట అని సినిమాపాట. (5) | 
| 14. ఇస్కూలు పోరలు చెల్లాచెదురయ్యారు (5) | 
| 15. దివాభీతముతో వెరపు (3) | 
| 18. కలివి కన్నులను కల పాము వెనుకనుంచి. (7) | 
| 19. నెలను తిరగేస్తే సంవత్సరమౌతుంది. (2) | 
| 21. పంథాను మార్చి తేలికపరిస్తే వేడి పుడుతుంది. (2) | 
| 22. తలపాగా (4) | 
| 23. జలాలుద్దీన్ రూమీ మరో నిక్ నేమ్ (6) | 
నిలువు
| 1. నాలుగో ఎకరం ఆసామి (4) | 
| 2. కావ్యము (2) | 
| 3. జలమయము కాదు గంధపు చెట్టు (5) | 
| 5. కాదంబరి చివరి స్థలసీమ (2) | 
| 6. నడుముపైని మూడు ముడుతలు (6) | 
| 9. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు కానదిప్పుడు; ____ ___ శ్రీనాథుని పద్యం (4,3) | 
| 10. తీరొక్క పూలను తెంపుకొచ్చితిని/సూదీ దారం తోటి దండ గుచ్చితిని/_____ __ అక్కకిచ్చితిని అని ఒక బాలగేయం ఇక్కడ శీర్షాసనం వేసింది. (5,2) | 
| 11. పార్వతి (3) | 
| 12. సత్వహీనము (3) | 
| 13. అప్పుడప్పుడే మొలిచిన మీసము (6) | 
| 16. పొగరు (5) | 
| 17. ఉదుంబరము (4) | 
| 20. నపుంసక పాత్రలకు పేరొందిన నటుడు ఈ వెంకటేశ్వరరావు (2) | 
| 21. డాంబరు (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 05 తేదీన వెలువడతాయి.
పదసంచిక-44జవాబులు:
అడ్డం:
1.గగనకుసుమం 4.అబుదాబీ 7.జిల్లా 8.సిర 9.ఇందిరామందిరము 11.సలిలం 13.చిత్రలహరి 14.గణుతికెక్కు 15.తపారు 18.లిబ్బులజవరాలు 19.వేప 21.సాగె 22.లులాపము 23.ముత్యమంతముద్దు
నిలువు:
1.గజిబిజి 2.గల్లా 3.మంత్రిమండలి 5.దాసి 6.బీరకాయచిక్క 9.ఇంచుపాలకడలి 10.ముఖప్రీతిమాటలు 11.సరిత 12.లంగరు 13.చిటికెనవేలు 16.పాపజగము 17.గానుగెద్దు 20.పలా 21.సాము
పదసంచిక-44కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- ఈమని రమామణి
- కన్యాకుమారి బయన
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- స్వర్ణ కుమారి
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

