పదసంచిక-49

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

 

ఆధారాలు:

అడ్డం:

1. తిరుమల తొలిగడప ఈ కడప (6)
4. ఇది ఎక్కడానికి మొగుణ్ణి కొట్టక్కరలేదు. (4)
7. తిరగబడ్డ ధేనువు (2)
8. సుగమ్‌బాబు తలలో మొలచిన ఆధునిక వచనకవితా ప్రక్రియ (2)
9. మహమ్మారి కలిగిన ఒకానొక సంగీత రాగవిశేషము (7)
 11. రాజ్యసభలో నక్కిన గాడిద (3)
13. నేరం నాది కాదు ఆకలిది సినిమాకు సినారె వ్రాసిన పాటలో ఈ నగరం ప్రస్తావన వుంది. (5)
14. సర్వజ్ఞుడు చెప్పిన మాటలు (5)
15. దుర్లభమైన ఆకాశం (3)
18. కోలాచలం వారి డ్రామా కంపెనీ (5,2)
19. ఇతరుల ధనమును సేకరించి అవసరమగు వారికి ఋణముల నిచ్చు సంస్థ అని దీని నిర్వచనం (2)
21. గాలి తీవ్రతవల్ల కలిగే ధ్వని వినడానికి లాహోరు దాకా వెళ్లాలా? (2)
22. నన్ను గురించి కథవ్రాయవూ అని కుముదంతో అడిగించుకుని కథ వ్రాసిన రచయిత. (4)
23. తాడేపల్లి లక్ష్మీకాంతరావు సినీ ప్రేక్షకులకు ఇలా సుపరిచితుడు. (2,4)

 

నిలువు:

1. వెదుకులాట (4)
2. తలక్రిందలైన భూమి (2)
3. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన వట్టికోట అళ్వారుస్వామి కథలపుస్తకం. కాస్త తడబడింది. (5)
5. నరసారెడ్డి కూతురును అత్తగారింటికి పంపుతూ ఇచ్చిన వస్తువులు (2)
6. పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడుకునే సామాగ్రి. (6)
9. ఛత్రపతి శివాజీ గురువు (3,4)
10. యగణానికి లఘువు ఎక్కడుందో చెప్పాల్సిన ధర్మరాజుకు సాటియైన వాడు. (5,2)
11. సోవియట్ పుస్తక ప్రచురణ సంస్థ. (3)
12. ఆం.ప్ర. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపేరు. (3)
13. థర్మోన్యూక్లియర్ అస్త్రాన్ని సాధారణంగా ఇలా అంటాము. (4,2)
16. ప్రియుడు గళ్ల చొక్కా తొడుక్కున్నాడని మ్యాచింగ్ కోసం ప్రేయసి ఇది తొడుక్కుంది. (2,3)
17. దిగ్భ్రాంతి (4)
20. కుచ్చిళ్లలో దాగిన చిన్న గుడిసె (2)
21. అహోరాత్రములో రెండున్నర గడియలు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 26 తేదీన వెలువడతాయి.

పదసంచిక-47జవాబులు:

అడ్డం:                                 

1.పెద్దబాలశిక్ష 4.మహావేధ  7.సము  8.ణిరా 9.బృందారకాధిపుడు  11.ప్రశంస  13.త్రంమంకరతా  14.వాయిదకారి 15.పందిరి 18.వురాప్పాఅలప్పుఅ  19.రవ  21.మోయు  22.కడచుక్క 23.తిరుమలరావు

నిలువు:

1.పెసరట్టు 2.ద్దము  3.క్షణికావేశం 5.వేణి 6.ధరాధరధారి 9.బృందారకధేనువు 10. డుదుసదవింరఅ 11.ప్రతాపం 12.సవారి 13.త్రంపరవీరక 16.దితిఅదితి 17.జటాయువు 20.వడ 21.మోరా

పదసంచిక-47కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • ఈమని రమామణి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కన్యాకుమారి బయన
  • భాగవతుల కృష్ణారావు
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • మీనా మోహన్
  • చుండూరి పద్మశ్రీ
  • పి. ఝాన్సీరాణి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here