‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం: |
1. వహీదా రెహమాన్ నృత్యం చేసిన ఒక తెలుగు సినిమా. (3,3) |
4.డెయిరీ ప్రాడక్టు. ఏ పాలవాడికో ఆర్డర్ ఇవ్వాలి. (4) |
7.కత్తుల కౌగిలి కావ్యరచయిత కృష్ణమూర్తి ఇంటిపేరు. తుపాకి. (2) |
8.సుగ్రీవుని పెండ్లాము (2) |
9.మెట్టినింటి నూలుచీర కాదు. యమున నటించిన తెలుగు సినిమా. (3,4) |
11.నీలాంబరి గదిలో బెత్తము (3) |
13.ఈ సిపాయి పిసరంత (నవ) రసములయందు దప్పిక గొనియున్నాడు. (5) |
14. సినిమాగా మలచబడిన యండమూరి నవల. చిరంజీవి, రాధలు జంటగా నటించారు. (5) |
15. ఉదార కార్యక్రమాలకోసం డబ్బు లేదా వస్తు రూపేణా చేసే సహాయం.(3) |
18. చిత్రకన్ను కథాసంపుటి వెలువరించింది ఈయనే. బేసిక్‌గా కవి. (3,4) |
19. న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి దంపతులు నడిపిన పిల్లల పత్రిక.(2) |
21. ఉత్తమ స్త్రీ, ప్రతికూలము, ఎడమ. (2) |
22. ప్రముఖ రచయిత శివరాజు వెంకట సుబ్బారావు ఇలా ప్రసిద్ధుడు. (4) |
23. ఉపనయనం జరిగిన వారు విధిగా ధరించేది.(6) |
నిలువు |
1. వైద్యుడు. రోగాలను పోగొట్టేవాడు కదా! (4) |
2.ఇది కూడా డెయిరీ ప్రాడక్టే (2) |
3.రైలు మర్గము.(5) |
5. తురుము.(2) |
6. దశావతారాలలో ఐదవది.(6) |
9. మరల మరల జన్మించుట… ఆదిశంకరుని భజగోవింద శ్లోకాలలోనిది.(4,3) |
10. బి.గోపాల్ దర్శకత్వంలో సిమ్రాన్, అంజలా జవేరిలతో బాలయ్య నటించిన సినిమా మొదట్లో కొంచెం తడబడింది. (7) |
11. బవిసిని మారిస్తే దేవదాసి.(3) |
12. మౌనశ్రీ మల్లిక్ కవితాసంపుటి. విషం.(3) |
13. రాచకొండ విశ్వనాథశాస్త్రి రచించిన నవల. (3-3) |
16. దాసరి సుబ్రహ్మణ్యం వ్రాసిన సుప్రసిద్ధ చందమామ జానపద నవల.(5) |
17. మగని మురిపెములో వేదము.(4) |
20. లక్ష్మీదేవి. సంపద. (2) |
21. వాపు బలుపు కాదు ____ అందం కాదు అని సామెత. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూన్ 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 23వ తేదీన వెలువడతాయి.
పదసంచిక-3 జవాబులు:
అడ్డం:
1.కలగూరగంప 4.ప్రియంవద 7.దయ 8.యాస 9.సహస్రావధానము 11.దుముకు 13. టడుతగుప్ప/టగుతడుప్ప 14.లీలా శుకుడు 15.టికాన 18.నిజపాదదర్శనం 19.రామి 21.వాత 22.లుషభము 23.నందనవనము
నిలువు:
1.కదనము 2.లయ 3.పరవశము 5.వయా 6.దసరాబుల్లోడు 9.సతీహితబోధిని 10.మునోనిశుకేదినం 11.దుప్పటి 12.కులీన 13.టక్కుటమారాలు 16.కామదహనం 17.భారతము 20.మిష 21.వాన
పదసంచిక-3కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధాసాయి జొన్నలగడ్డ
- వైదేహి అక్కపెద్ది
- ఈమని రమామణి
- కురవి వెంకట కృష్ణశాస్త్రి
- వర్థని మాదిరాజు
- శుభా వల్లభ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- తాతిరాజు జగం