Site icon Sanchika

పదసంచిక-53

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గజ్జిని మలుపు దినుసుతో నిష్ఠానము (3,3)
4. మరీచిక (4)
7. తోడేళ్లగొంగ (2)
8. అవిభక్తమైన ప్రకాశము (2)
9. ముక్కుపుడక (7)
 11. నరధర్మములో స్వాంతము (3)
13. సత్కారాలలో సాధారణంగా దీనిని కప్పుతారు. (5)
14. ఒక చలనబిందువు ఒకేదిక్కుగా చలించునప్పుడేర్పడిన బిందుపథము (5)
15. గతితప్పిన నాడి (3)
18. నా విఫల భూకము సరిచేస్తే పుల్లంటురాయి వస్తుంది కానీ ఇక్కడ వెనుక నుండి. (7)
19. సరవిలో జీవుడు (2)
21. ఉపక్రమణికలోని రత్నం. (2)
22. ఒంటరి హృదయం కాదు విడిది గృహం (4)
23. కోడి రామ్మూర్తి బిరుదు. (4,2)

నిలువు:

1. Cygnus olor  దీని శాస్త్రీయ నామం (4)
2. ఖోండు ప్రజల గ్రామాధికారి శీర్షాసనం వేశాడు. (2)
3. ఇంద్రుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన గిఫ్టు  కలగాపులగమైంది. (5)
5. భృంగాభీష్టము మీవి కాదు.(2)
6. భారత పాకిస్తాన్‌ల నడుమ రాడ్‌క్లిఫ్‌ గీచిన రేఖ (4,2)
9.  డిక్షనరీ (7)
10. కొబ్బరికాయవలె త్వరగా కొఱుకుడు పడని క్లిష్టమైన శైలి కనుక క్రింది నుండి పైకి చదవండి. (7)
11. నవరత్నాలలో చివరి రెండు మాయం (3)
12. నరసయ్య నాలుక (3)
13. రాంగోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా ఇతని జీవితం ఆధారంగా నిర్మించబడింది. (4,2)
16.  ఇంపార్టెంట్ రోల్ (2,3)
17. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. (4)
20. హడావిడిలో క్రోధము (2)
21. కొరడాను క్రింద నుండి ఝళిపించండి. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మే 19 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 24 తేదీన వెలువడతాయి.

పదసంచిక-51 జవాబులు:

అడ్డం:                                 

1.ఆషాఢ పూర్ణిమ 4. ఆణిపూస 7. శాండో 8. రాజీ 9. ఆరున్నొక్కరాగము 11. ఆలుగ 13. ఆకుపసరు 14. విపణి వీధి 15. ద్రరిహ 18. నుతజలపూరితం 19. దులి 21. ఈపె 22. భిదురము 23. చిత్తూరు నాగయ్య

నిలువు:

1.ఆశాంతము 2. షాడో 3. మధ్యాక్కరలు 5. పూరా 6. సజీవ సమాధి 9. ఆగస్టు పదిహేను. 10. మునిమాణిక్యం కాంతం 11. ఆరుద్ర 12. గవిహ 13. ఆనకదుందుభి 16. రిహలత్రచి 17. ఆవుపెయ్య 20. లిదు 21. ఈగ

పదసంచిక-51కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version