Site icon Sanchika

పదసంచిక-6

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:
1. దీనిలో నెయ్యి వున్న చందాన పేరుకు మాత్రమే గొప్ప. (2,4)
4. నవరత్నాలలో ఒకటి. టోపాజ్. (4)
7.కత్తిపడవలులో కడవలు మాయం చేస్తే దూది మిగులుద్ది. (2)
8. కలకండ మొదలు చివరలతో చివర.(2)
9. కులవృక్షం రచయిత్రి. ఇంటి పేరు ముందుకొచ్చింది. (4,3)
11. రెట్టమతములో పక్షి మలాన్ని తీసేయి.(3)
13. చిలుక (5)
14. సహనమున్న కవచము (5)
15.  శ్రీశ్రీ సాహిత్య క్రీడా వినోద సంపుటము. చప్రాసితో కలిసి వెదకండి. (3)
18. పదవీకాలంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. (7)
19. మూడింటి సమూహము (2)
21. పెద్దల మాట చద్దన్నం ___ అని ఒక సామెత. (2)
22. యాచకుడు. (4)
23. పాలాభిషేకం దీనికి ఒక చక్కని ఉదాహరణ. (6)

 

నిలువు
1.పథ్యమునే బ్యాక్‌గ్రౌండ్ ప్రాతిపదిక.(4)
2.ప్రతిపత్తిలో తోలు సంచి. (2)
3.యమదూతనే. విగ్రహవాక్యం.(5)
5.  నిరాకరణలో ఆగమనం (2)
6.  రెండు తలల పక్షి. మైసూరు రాజ్యపు ధ్వజ చిహ్నము. (6)
9.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాకన్నా నట సార్వభౌమునిగా ప్రసిద్ధుడు. పేరులోని రెండవభాగం తల్లక్రిందలయింది.(3,4)
10.  ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి (7)
11.   మసిబట్టతో పొట్టివాడు. (3)
12.   ముదుసలిలో దు లేకున్నా తేడాలేదు.(3)
13.   కదిలే బొమ్మ. సినిమా (6)
16.   జాలాది వ్రాసిన “యాతమేసి తోడినా ఏరు ఎండదు” పాట వున్న సినిమా. (2,3)
17.   కోతి. దాటు నపుడు కొమ్మల సందున బడి చచ్చునది అని దీని వ్యుత్పత్తి. (4)
20.  చేతికఱ్ఱ, బెత్తము (2)
21.  సమూహములో అచ్చు. Crucible. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను జూన్ 25వ తేదీలోపు  puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితోబాటుగా జూన్ 30వ తేదీన వెలువడతాయి.

పదసంచిక-4 జవాబులు:

అడ్డం:

1.రామవల్లభము 4.  ముక్కామల  7.  జట్టు 8.  గయ  9.  గాంధీపుట్టినదేశం 11. ఆత్రము 13. కాలపనయా  14. రామానాయుడు 15. సంచారి 18. నమస్తేతెలంగాణా 19. డనీ 21. గుహ 22. లులాయము 23. విశాఖపట్టణం

నిలువు:

1.  రాజనాల 2.  మట్టు 3.  ముమ్ముట్టియాత్ర  5.  మగ 6.  లయకారకుడు 9.  గాంధర్వపద్ధతిన 10. శంకరనారాయణ 11. ఆయాసం 12. మురారి 13. కావడికుండలు 16. చావుతెలివి 17. ఆరోహణం 20. నీలా 21. గుట్ట

పదసంచిక-4కి సరైన సమాధానాలు పంపిన వారు:

  1. అనూరాధాసాయి జొన్నలగడ్డ
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. భాగవతుల కృష్ణారావు
  4. పాటిబళ్ళ శేషగిరిరావు
  5. పి. ఝాన్సీరాణి
  6. వైదేహి అక్కపెద్ది
  7. వర్థని మాదిరాజు
  8. శుభావల్లభ
  9. తాతిరాజు జగం

 

 

Exit mobile version