పదసంచిక-69

0
1

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఒకానొక నంది ఉత్తమ చిత్రం (3,3)
4.  నటీమణి. చారుహసన్ పుత్రికారత్నం. (4)
7. కపటం, గర్వం (2)
8. పడు రా రా రా రా (2)
9. కొట్ర శ్యామలకామశాస్త్రి గారి బృహత్తర నిఘంటువు (2,5)
 11. వీణ శేషణ్ణకు ఉన్న బుద్ధి (3)
13. నూఱంచుల కత్తి (5)
14. బొబ్బిలికి చెందిన కథారచయిత శ్రీనివాసరావు ఇంటిపేరు (5)
15. కంపము (3)
18. చిత్తూరి మాండలికంలో లైఫ్ లాంగ్ (7)
19. పేకమేడలో తిరగబడ్డ ఛాగము (2)
21. మకరిలో కోతి (2)
22. వ్యాయామి కేలుసాచి వెనుకకు చూస్తే వ్యాధి కనిపిస్తుంది. (4)
23. ఊకదంపుడు (6)

నిలువు:

1. తమిళనాడులోని ఒక శైవక్షేత్రం. (4)
2. లాభం మొదట్లో కుఱచ అయ్యింది. (2)
3. నడవడిక కలిగిన యాక్షన్ (5)
5. రాజ్ మాదిరాజు నవల (2)
6. దేవునికి సమర్పించే ఒక మొక్కుబడి (6)
9.  అబ్బో దీనికి అంతూపంతూ లేదు. (7)
10. వేణుగోపాలస్వామిపై విశ్వనాథవారి పద్యకృతి (3,4)
11. అడ్డం 11 లాంటిదే (3)
12. లోకైకవీరుడిలో బలహీనమైనది (3)
13. పతంజలి శాస్త్రి కథలు (2,4)
16.  వాగుడుకాయ. (5)
17. జలజంతు ప్రదర్శనశాల (4)
20. కీలమే (2)
21.  కలబంద (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 13 తేదీన వెలువడతాయి.

పదసంచిక-67జవాబులు:

అడ్డం:                                 

1.చిలుకపలుకు 4. మంతకాని 7. క్రోలు 8. మాఘం 9. పాడవేల రాధికా 11. వేశ్నగే 13. కార్పటికుడు 14.హరిచన్దన 15. కషము 18. సహధర్మచారిణి 19. నన 21. కోకో 22. మునసబు 23. లుబ్ధావధానులు

నిలువు:

1.చిక్రోడము 2. లులు 3. కుశలప్రశ్న 5. కామా 6. నిఘంటుశోధన 9. పాలపాటిసరస 10. కాకాని చక్రపాణి 11. వేడుక 12. గేహము 13. కాపిశాయనము 16. షట్కర్మములు 17. వేడికోలు 20. నన 21. కోను

పదసంచిక-67కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • కన్యాకుమారి బయన
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు కోట
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here