Site icon Sanchika

పదసంచిక-74

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కార్యేషు దాసి, కరణేషు మంత్రి (4,2)
4. కవి (4)
7. కాంతిహీనమైన అంగరాజు కూతురి ప్రబంధము. (2)
8. పులికంటి వారి పూలబుట్ట (2)
9. పస్తు చివర పాయసాన్నమును పాసాను(pass on) చేస్తే దర్శనమిచ్చే తెలుగు పండితుడు. (4,3)
 11. భర్తలు తడబడి ఇంటిగడపను చూపారు.(3)
13. అహంభావ కవి (5)
14. అంబర్ ఫిట్టింగ్ (5)
15. “ఇదొక  లంఘనాఫలకం (స్ప్రింగ్‌బోర్డ్). దీనిమీద నిలబడి మనుష్యుడు ప్రగతిపథమున కెగుర గలిగి ఉండవలెను” అని సర్దేశాయి తిరుమలరావు చెప్పినది దేనిగురించి? (3)
18. ఊహింపరే చెలులు గద్దరి _ _ _ _ _ _ _ అంటాడు అన్నమయ్య ఒక కీర్తనలో(7)
19. అడ్డం 14లో చండాలుడు. (2)
21. అడ్డం 4ను అట్నించి పిలిస్తే గర్వం కలుగుతుంది. ఉత్సాహం లభిస్తుంది. (2)
22. లేతమనసులు చిత్రంలోని బాలతారతో రాతికట్టడపు నేల (4)
23. నారదుడు తిరగబడ్డాడు. (6)

నిలువు:

1. బక్కయేనుగు కాదు ఏడాది నిండని దూడ (4)
2. ప్రియంవదాసుతునితో సన్యాసి (2)
3. భీరువు. (5)
5. ఈ కులంలో రక్షణమున్నది. (2)
6. పదేపదే శీర్షాసనం వేస్తే ఎలా?(6)
9.  తగలబడటం రేణుకాసుతునికి ఇష్టం. (5,2)
10. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది వేదపరిభాషలో (3,4)
11. కె-15 క్షిపణిలో పచ్చిక (3)
12. అభిమానం (3)
13. దీనికి సందడే సందడి అందుకే రెడీ కమ్మంటున్నాడు మన బాలు ఓ పాటలో. (6)
16.  కరుడు గట్టిన విద్వాంసుడు (5)
17. దేవినేని సూరయ్య బిరుదము (4)
20. అడ్డం 22లోని మన్ను (2)
21.  బ్రహ్మ తలను లాగితే గల్లీ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 18 తేదీన వెలువడతాయి.

పదసంచిక-72 జవాబులు:

అడ్డం:                                 

1.మాధవి సనారా 4. నారాచము 7. తుట్ట 8.దిష్టి 9. ఆమదాలవలస 11.కుటిక 13. దేవదేవుడు 14. మహనీయుడు 15. కపులు 18. వరాహమిహిరుడు 19. కుజు 21. ఐ యు 22. డుమ్మా కొట్టు 23. గుడుసు కైదువు

నిలువు:

1.మాతులాని 2. ధట్ట 3. రావులపాటి 5. చది 6. ముష్టికాంతకుడు 9. ఆచార్య దేవోభవ 10.సరోజినీ నాయుడు 11. కుడుక 12. కమలు 13. దేశోధ్ధారకుడు 16. పున్నమి నాగు 17. వాతాయువు 20. జుమ్మా 21.ఐదు

పదసంచిక-72కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version