పదసంచిక-76

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గాడిచర్ల హరిసర్వోత్తమరావుచే మొదటి సారి ప్రతిపాదించబడి రాయప్రోలు, కృష్ణశాస్త్రుల పూనికతో పరిఢవిల్లినది. (2,4)
4. కోస్టారికా, డెన్మార్క్, నార్వే, గుయానా దేశాలతో శోభన్‌బాబుకు ఉన్న సంబంధం (4)
7. నిమిషాలలో శిలావృష్టి (2)
8. ఓర్వదగిన ఒక కొండ పేరు. (2)
9. దేశి చంధస్సులో తొలి తెలుగు కావ్యాన్ని వ్రాసిన కవి (4,3)
 11. సరుకును తిరగేసి కొమ్మును బదలాయించడమనేది మోటుమాట (3)
13. నరసింగరావు తీసిన అవార్డు సినిమా (5)
14. ఇటీవల కోవిడ్ బారినపడిన ఆర్టిస్టు (5)
15. ఈ ఒంటెపిల్ల పరాశర భట్టర్‌దా? (3)
18. సౌందర్యముతో ముగిసే ceasefire (3,4)
19. శివరామకృష్ణలో కుప్ప (2)
21. కన్నడ ఘృతానికి శృంగాన్ని తగిలిస్తే కిలుమా? (2)
22. పాలు కాని పాలు (4)
23. పనితనమ్ము చూపు కృషీవలుడు కృషి చూపు పనిని తీసి సరిచేస్తే కామదేవుడు కనిపిస్తాడు. (6)

నిలువు:

1. వాక్కాంత(4)
2. నవలలో విసిరేది, పన్నేది (2)
3. కలుషిత జలము (5)
5. తెలంగాణ సాహిత్య అకాడమీవారి త్రైమాసికలోని ముక్కు (2)
6. పైడిరాజు (6)
9.  ఎస్.రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గానం చేసిన అమృతగుళిక ఇద్దరు మిత్రులు సినిమాలోనిది.(4,3)
10. శివనారాయణ శీర్షాన్ని పట్టి గుంజి ముందు ఓ వర్ణాన్ని తగిలిస్తే నసీబు. (7)
11. శకలములో చెంబు (3)
12. పరీక్షిత్తు భార్య. మండూకరాజు కుమార్తె. (3)
13. బూర్జువా పెళ్ళికూతురు సోమరాజుగారికి బెంగ ఎక్కువ. (2,4)
16.  రసము లేనిది (5)
17. హమేషా (4)
20. శివాలయంలోని పాషాణం (2)
21.  ఉరుదూ నీవుతో క్షుతము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 27 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 01 తేదీన వెలువడతాయి.

పదసంచిక-74 జవాబులు:

అడ్డం:                                 

1.శయనేషు రంభ 4. నీటికాకి 7. కృతి 8. పుటి 9. పరవస్తు చిన్నయ 11. గలుమ 13. సుందరాచారి 14. మడత పేచీ 15. కవిత్వం/ కవిత 18. తిరు వేంకటపతి 19. డమ 21. వీక 22. కుట్టిమము 23. డు ను ద నం ధివి

నిలువు:

1.శకృత్కరి 2. యతి 3. భయస్తురాలు 5. కాపు 6. కిటిమాకిటిచీ 9. పరశు రామ ప్రీతి10. యద్భావం తద్భవతి 11. గరిక 12. మమత్వం/ మమత 13. సుందరాకాండకు 16. విద్యాకరుడు17. చిత్రకవి 20. మట్టి 21. వీధి

పదసంచిక-74కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కన్యాకుమారి బయన
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఎన్.కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రాజేశ్వరి కనకగిరి
  • రాజేశ్వరి రావులపర్తి
  • రామలింగయ్య టి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్య మనస్విని సోమయాజుల
  • శ్రీధర్ ముప్పిరాల
  • సుభద్ర వేదుల
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here