Site icon Sanchika

పదసంచిక-78

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. Y.శ్రవణ్ ఇల్లు ఒక వృక్షమా?(6)
4. నాదభరిత, రాగయుక్త వేదపారాయణం అపసవ్య దిశలో (4)
7. తాజమహలు నుండి ఆదాయం (2)
8. నిలువు 1లో నిక్షిప్తమైన తేజ సినిమా (2)
9. అననుభూత పూర్వము (7)
11. కవి కలం బంగారంలా విలువైనది. ఈ వాక్యంలో జాగుచేయక జాగును వెతకండి. (3)
13. సాల్యుబుల్ (5)
14.  ధరల యొక్క పై హద్దులు (MRP) (5)
15. మృతదేహాలను కొందరు ఇది చేస్తారు. (3)
18. మేనమామ కొడుకు తలను తెగ్గోసి సెంటర్‌లో పెట్టండి. (7)
19. శ్రీశ్రీ తన చేదుపాటలో ముందువెనకల ఇదే ఉందన్నాడు. (2) 
21. సూర్యుడు+చంద్రుడు = శివుడు+బ్రహ్మ = కాలము+విషము = నాది(2)
22. రూలు తిరబడింది (4)
23. మూడో తంత్రం (6)

నిలువు:

1. 1894లో మద్రాసు నుండి ప్రారంభమైన తెలుగు సాహిత్య మాసపత్రిక (4)
2. నిలువు 17 గర్భంలోని కష్టము (2)
3. కందువ (5)
5. మజ్జారే! అడ్డం 7 తిరగబడిందే!! (2)
6. మాపటివేళలు సాలు యాస మయం అని అంటే ఎలా?(6)
9.  రెవెన్యూ డిపార్ట్‌మెంటుకు చెందిన జవాను (7)
10. ఈ వ్యాపారి యువకుడేమీ కాదు. (3,4)
11. కవి ముఖపంకజములోని శత్రువు (3)
12. ధనం కాని ధనం (3)
13. నాలాయిరమ్ (6)
16.  నా ఖర్మకాలి మావనడిగాను విరజాజి చెట్టెక్కడుందని? వెను తిరిగి చూసుకో అన్నాడు. (5)
17. మిక్చర్ (4)
20. అడ్డం 4లోని పిపీలికం (2)
21.  అడ్డం 22 కడుపులో కంచరగాడిద. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 10  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 15 తేదీన వెలువడతాయి.

పదసంచిక-76 జవాబులు:

అడ్డం:                                 

1.భావకవిత్వము 4. కోడెనాగు 7 షాల 8. సహ్య 9. పాల్కురికి సోమన 11. కరుసు 13. రంగులకల 14. శోభానాయుడు 15. శరభ 18. కాల్పుల విరమణ 19. రాశి 21. తుప్పు22. జులపాలు 23. నలువ తమ్ముడు

నిలువు:

1. భాషాయోష/భాషాలక్ష్మి 2. వల  3. మురికి నీరు 5. నాస 6 గుహ్యకేశ్వరుడు 9. పాడవేల రాధికా 10. నశీవనారాయణ 11. కలశ 12. సుశోభ 13. రంధి సోమరాజు 16. రసవిహీన 17. ఎల్లప్పుడు 20. శిల 21. తుమ్ము 

పదసంచిక-76కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version